Viral Photo: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… శనివారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరి వరకు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్… మ్యాచ్ ను చేజేతులా పోగొట్టుకుంది. ఈ మ్యాచ్లో కేవలం రెండంటే రెండు పరుగులు తేడాతోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో.. చాలా అరుదైన సంఘటనలు జరిగాయి.
స్టేడియంలో ఇద్దరు లవర్స్ రచ్చ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో… ఇద్దరు లవర్స్ ఫ్లకార్డ్ పట్టుకొని రచ్చ చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలవాలని కుర్రాడు ఫ్ల కార్డు పట్టుకుంటే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలవాలని అమ్మాయి మరో ఫ్లవర్ కార్డు పట్టుకుంది. ఇక్కడ విషయం ఏంటంటే… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గెలిస్తే…. తన ప్రియురాలు మొబైల్ ఫోన్ లో ఉన్న men బెస్ట్ ఫ్రెండ్స్ నెంబర్లు అన్ని బ్లాక్ చేయాలి. ఇదే విషయాన్ని ఆ కుర్రాడు ఫ్లకార్డులో రాసి… పట్టుకున్నాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిస్తే.. ఆ అమ్మాయి షాపింగ్ మొత్తం కుర్రాడు చూసుకోవాలి. ఇదే విషయాన్ని తన ఫ్లాకార్డులో ఆ యువతి రాసుకుంది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. నిన్నటి మ్యాచ్ సందర్భంగా నే ఈ సంఘటన జరిగింది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజెన్స్… తమకు నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. ఆ యువతికి చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు, మహేంద్రసింగ్ ధోని అన్యాయం చేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. దీనికి కారణం నిన్నటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడమే. రెండు పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడంతో ఆ యువతి కూడా ఈ పందెంలో ఓడిపోయింది. దీంతో కుర్రాడు గెలిచాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ కుర్రాన్ని గెలిపించింది రాయల్ చాలెంజెస్ బెంగళూరు డేంజర్ ఆటగాడు రొమారియో షెఫర్డ్ అంటూ మరి కొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు. మొత్తానికి ఈ యువ జంట… ప్లకార్డుల ప్రదర్శన.. హాట్ టాపిక్ గా నిలిచింది.
చేజేతులా ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్నిత 20 ఓవర్లలో ఐదు వికెట్ నష్టపోయి 213 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, రొమారియో అద్భుతంగా ఆడడంతో ఆమాత్రం స్కోర్ చేయగలిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఈ టార్గెట్ చేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. కానీ చివర్లో ధోని, రవీంద్ర జడేజా సరిగ్గా ఆడక పోవడంతో మ్యాచ్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 211 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.
I am a CSK fan but for the first time I want RCB to win💀 pic.twitter.com/C36vvS1uJs
— Hustler (@HustlerCSK) May 3, 2025