U19 Asia Cup 2025: అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( ACC Mens U19 Asia Cup 2025) విజేతగా పాకిస్తాన్ జట్టు నిలిచింది. ఆదివారం దుబాయ్ లోని ఐసిసి అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ (ICC Academy Ground, Dubai) ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా అండర్ 19 జట్ల ( India U19 vs Pakistan U19, Final ) మధ్య జరిగింది. 50 ఓవర్ల ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా పై ఏకంగా 191 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. ఈ విజయంతో తొలిసారి ఆసియా కప్ టైటిల్ ను సొంతంగా గెలిచింది పాకిస్తాన్. గతంలో ఇండియా అలాగే పాకిస్తాన్ రెండు జట్లు ఒకసారి టైటిల్ ను పంచుకున్నాయి. ఇక ఇప్పుడు సొంతంగానే ఛాంపియన్ అయింది పాకిస్తాన్.
Also Read: Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్
ఆసియా కప్ 2025 అండర్ 19 టోర్నమెంట్ ( ACC Mens U19 Asia Cup 2025) విజేతగా పాకిస్తాన్ విజయం సాధించిన నేపథ్యంలో వాళ్ల దేశంలో సంబరాలు జోరు అందుకున్నాయి. ఇస్లామాబాదులో అర్ధరాత్రి టపాకాయలు పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు. అర్ధరాత్రి 2 గంటలకు వరకు పాకిస్తాన్ లో పరేడ్ నిర్వహించారు. ఈ సందర్బంగా పాకిస్తాన్ అండర్ 19 క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అర్ధరాత్రి 2 గంటలకు చలిలో కూడా వచ్చారు ఫ్యాన్స్. అదే సమయంలో ఇండియాను కించే పరిచేలా నినాదాలు చేసినట్లు సమాచారం. ఇక పాకిస్తాన్ సంబరాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఛాంపియన్ గా ( ACC Mens U19 Asia Cup 2025) అండర్ 19 పాకిస్తాన్ నిలిచిన నేపథ్యంలో భారీగానే ప్రైజ్ మనీ దక్కింది ( asia cup under 19 pakistan team prize money). ఛాంపియన్ గా నిలిచిన పాకిస్తాన్ అండర్ 19 జట్టుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తరఫున 15 వేల డాలర్లు దక్కాయి. అంటే పాకిస్తాన్ రూపాయలలో 42 లక్షలు అందాయి. ఇక రన్నరప్ గా నిలిచిన టీమిండియా జట్టుకు 7500 డాలర్ల ప్రైజ్ మనీ ఇచ్చారు. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గెలిచిన అండర్ 19 పాకిస్తాన్ జట్టు ఒక్కో ప్లేయర్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రత్యేకంగా ప్రైజ్ మనీ ఇచ్చింది. ఒక్కో ఆటగాడికి 50 లక్షల పాకిస్తాన్ రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటన మాత్రమే చేశారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ. అటు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ను తన చేతుల మీదుగా పాకిస్తాన్ జట్టుకు అందించారు మొహ్సిన్ నఖ్వీ.
Also Read: T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే
🚨 U19 ASIA CUP VICTORY PARADE IN ISLAMABAD🤯
– The team received a warm welcome at 2 AM despite the winter ❤️pic.twitter.com/3pEc9BsuXL
— junaiz (@dhillow_) December 22, 2025