BigTV English

Virat Kohli – RCB: ఇది కదా తెలుగోడి అభిమానం అంటే.. విరాట్ కోహ్లీ కోసం ఏం చేశాడంటే?

Virat Kohli – RCB: ఇది కదా తెలుగోడి అభిమానం అంటే.. విరాట్ కోహ్లీ కోసం ఏం చేశాడంటే?

Virat Kohli – RCB: విరాట్ కోహ్లీ.. ఈ పేరే ఓ బ్రాండ్. కోహ్లీ చూడడానికి ఎంత అగ్రెసివ్ గా కనిపిస్తాడో.. అంతే అగ్రెసివ్ గా ఆడతాడు. తనదైన ఆటతీరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీకి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఓ చెరిగిపోని గుర్తింపు ఉంది. ఈయన పేరు తెలియని వారు ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను తన క్రికెట్ ఆటతో మెప్పించి.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ.


Also Read: Brydon Carse – SRH: టీమిండియాను వణికించిన SRH ప్లేయర్‌.. ఫుల్‌ జోష్‌ లో కావ్యా పాప !

అయితే సొంత ఇల్లు కలిగి ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల. ఆ కలను సహకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు. తమ కలలకు, అభిరుచులకు సరిపోయే విధంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఓ తెలుగు వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటిపై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పేరు, అలాగే విరాట్ కోహ్లీ బొమ్మని వేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు.


నూతనంగా నిర్మించుకుంటున్న తన ఇంటి ఎలివేషన్ పై కుడి వైపున విరాట్ కోహ్లీ బొమ్మతోపాటు.. ఆ ఫోటో కింద రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పేరుని లిఖించాడు. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు.. ” క్రికెట్ లో అందరికీ అభిమానులు ఉంటారు కానీ.. విరాట్ కోహ్లీకి మాత్రమే భక్తులు ఉంటారు అని మరోసారి రుజువయ్యింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక విరాట్ కోహ్లీ కూడా ఇటీవల ముంబైలో తన డ్రీమ్ హౌస్ ని దగ్గరుండి మరీ నిర్మించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముంబైలోని అలీబాగ్ లో ఈ ఇంటిని నిర్మించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఏకంగా ఈ ఇంటికి 34 కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక ఆర్కిటెక్చర్ కి అద్దం పట్టేలా ఈ ఇంటిని డిజైన్ చేయించుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేయబోతున్నాడు.

Also Read: Tilak Varma: తెలుగోడు సరికొత్త చరిత్ర…కోహ్లీ, మార్క్ చాప్మన్ రికార్డు బద్దలు !

జనవరి 31 తేదీన రైల్వేస్ జట్టుతో ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ ఏడబోతున్నాడు. ఇందుకోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఈ మ్యాచ్ జరగబోతున్న అరుణ్ జైట్లీ స్టేడియంలో పదివేల మంది ప్రేక్షకులను విరాట్ కోహ్లీ బ్యాటింగ్ని ఉచితంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసింది ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ). అంతేకాదు అవసరమైతే మిగిలిన స్టాండ్ల గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా అభిమానుల కోసం ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీ భద్రతను కూడా పెంచబోతున్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by cricket & Movie lover (@cricket_trends_telugu)

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×