E-Paper
Advertisement

కొంపముంచిన సాయి సుద‌ర్శ‌న్ హిట్ వికెట్..ఐపీఎల్ 2026 ఫైన‌ల్స్‌లోకి RCB

కొంపముంచిన సాయి సుద‌ర్శ‌న్ హిట్ వికెట్..ఐపీఎల్ 2026 ఫైన‌ల్స్‌లోకి RCB
Advertisement

Sai Sudharshan hit wicket:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. ఈ టోర్నమెంట్ లో మొదటి నుంచి అద్భుతంగా రాణిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ), అందరూ ఊహించినట్లుగానే ఫైనల్స్ చేరుకుంది. 2025 ఐపీఎల్ సందర్భంగా టైటిల్ గెలిచిన బెంగుళూరు, ఈసారి కూడా అద్భుతంగా రానించి ఫైనల్ లాగా వెళ్ళింది. క్వాలిఫైయర్ 1 లో భాగంగా మంగళవారం రోజున గుజరాత్ టైటాన్స్ వర్సెస్ బెంగళూరు (Royal Challengers Bengaluru vs Gujarat Titans) మధ్య ధర్మశాల (Himachal Pradesh Cricket Association Stadium, Dharamsala) వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బెంగుళూరు, గుజరాత్ టైటాన్స్ పై ఏకంగా 92 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు ఫైనల్ కు చేరగా.. గుజరాత్ టైటాన్స్ మాత్రం క్వాలిఫైయర్ 2 ఆడనుంది. అక్కడ కూడా ఓడిపోతే ఇంటి దారి పట్టనుంది.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

గుజరాత్ టైటాన్స్ కొంపముంచిన సాయి సుదర్శన్ హిట్ వికెట్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) క్వాలిఫైయర్ 1 లో భాగంగా బెంగళూరు వర్సెస్ గుజరాత్ మధ్య ధర్మశాల వేదికగా మంగళవారం మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్నిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 254 పరుగుల భారీ టార్గెట్ ను గుజరాత్ టైటాన్స్ ముందు ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెత్త ప్రదర్శన కనబరిచిన గుజరాత్ టైటాన్స్, చిత్తుగా ఓడిపోయింది. ప్రతి మ్యాచ్ లో అదరగొడుతున్న ఓపెనర్లు ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ హిట్ వికెట్ ( Sai Sudharshan hit wicket) మాత్రం చాలా బాధాకరం.

జాకబ్ డఫీ వేసిన ఓ అద్భుతమైన బంతిని… బౌండరీ బాదాడు సాయి సుదర్శన్. అక్కడి వరకు బాగానే ఉంది, బౌండరీ కొట్టిన సాయి సుదర్శన్ (Sai Sudharshan ) బ్యాట్ వదిలేసాడు. ఇంకేముంది ఆ బ్యాట్ వెళ్లి వికెట్ల పైన పడింది. దీంతో హిట్ వికెట్ కింద సాయి సుదర్శన్ వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ పతనం మొదలైంది. రాహుల్ తెవాతియా ఒక్కడే అర్థ సెంచరీ తో మెరుపులు మెరిపించినా… ఫలితం దక్కలేదు. ఛేజింగ్ చేసే క్ర‌మంలో 19.3 ఓవ‌ర్లు ఆడిన గుజ‌రాత్…162 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది.

Advertisement

దీంతో బెంగళూరు ఫైనల్స్ కు వరుసగా రెండోసారి దూసుకువెళ్లింది. గుజరాత్ టైటాన్స్ జట్టుపైన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… మే 31వ తేదీన ఫైనల్స్ ఆడనుంది. అహ్మదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ బిగ్ ఫైట్ ఉండనుంది.  ఇక అటు మే 29వ తేదీన క్వాలిఫైయ‌ర్ 2 లో భాగంగా హైద‌రాబాద్ / రాజ‌స్థాన్ ల‌లో ఓ జ‌ట్టుతో గుజ‌రాత్ త‌ల‌ప‌డ‌నుంది.

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×