E-Paper
Advertisement

టీమిండియాలోకి వైభ‌వ్ వ‌స్తే..రోహిత్ శ‌ర్మ‌తో పాటు ఈ 7 గురి ప‌ని ఔట్ !

టీమిండియాలోకి వైభ‌వ్ వ‌స్తే..రోహిత్ శ‌ర్మ‌తో పాటు ఈ 7 గురి ప‌ని ఔట్ !
Advertisement

Vaibhav Sooryavanshi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, ఈ సీజన్ లో అద్భుతంగా ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియాలోకి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) తీసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య త్వరలో టి20 సిరీస్ జరగనుంది. ఆ సమయంలో కచ్చితంగా టీమిండియాలోకి వస్తాడని అంటున్నారు. ఆ తర్వాత వన్డేలు, టెస్టుల్లో కూడా వైభవ్ స్థానం దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

వైభ‌వ్ వ‌స్తే..రోహిత్ శ‌ర్మ‌తో పాటు ఈ 7 గురి ప‌ని ఔట్

Advertisement

టీమిండియాలోకి వైభవ్ సూర్య వంశీ వస్తే, ఎవరిపైన వేటు పడుతుందని దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఒకవేళ భారత సెలెక్టర్లు, ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ ను సెలెక్ట్ చేస్తే మాత్రం ఏకంగా ఏడుగురి కెరీర్ పైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో ముందు వరుసలో రోహిత్ శర్మ ఉంటాడని అంటున్నారు. అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్లకు కెరీర్ పైన వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎఫెక్ట్ కచ్చితంగా ఉండనుందని చెబుతున్నారు.

ముందుగా యశస్వి జైస్వాల్ పైన వైభవ్ ఎఫెక్ట్ పడనుంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టులో యశస్వి జైష్వాల్ కు రావాల్సిన క్రెడిట్ మొత్తం లాగేసుకున్నాడు వైభవ్. ఇప్పుడిప్పుడే టీం ఇండియాలో అవకాశాలు దక్కించుకుంటున్న యశస్వి జైష్వాల్ కు వైభవ్ ఎంట్రీ నిరాశను మిగిల్చే ఛాన్స్ ఉంది. అలాగే టి20 లు, వన్డేల్లో ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న గిల్ పైన కాస్త ఎఫెక్ట్ పడుతుంది. వైభవ్ వస్తే గిల్… తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక అభిషేక్ శర్మకు నిప్పుతో చెలగాటం లాగా మారనున్నాడు వైభవ్. అభిషేక్ శర్మ తరహా లోనే దూకుడుగా వైభవ్ బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి… సెలెక్టర్లు ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే ఛాన్సులు ఉంటాయి. అభిషేక్ శర్మ ఫెయిల్యూర్ అయితే, వెంటనే లెఫ్ట్ హ్యాండ్ అయిన వైభవ్ కు ఛాన్స్ వస్తుంది. బీసీసీఐ ఇచ్చిన అవకాశాన్ని వైభవ్ కాపాడుకుంటే.. ఇక అభిషేక్ శర్మను మర్చిపోవాల్సిందే.

రోహిత్ శ‌ర్మ‌కు కూడా టెన్ష‌నే

Advertisement

సంజు శాంసన్ కూడా అభిషేక్ శర్మతో ఓపెనర్ గా అప్పుడప్పుడు బరిలోకి దిగుతున్నాడు. వైభవ్ బరిలోకి దిగితే సంజు, ఇషాన్ కిషన్ పరిస్థితి కూడా దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది. వన్డేల్లో కూడా వైభవ్ రంగంలోకి దిగాడు అంటే.. రోహిత్ శర్మ కూడా తప్పుకోవాల్సిందేనని చెబుతున్నారు. రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోతే వన్డే వరల్డ్ కప్ 2027 కోసం కూడా వైభవ్ ను పరిశీలనలో పెట్టారట బీసీసీఐ పెద్దలు. ఇక లేటెస్ట్ గా టెస్టుల్లో రాణిస్తానని వైభవ్ వెల్లడించారు. అదే జరిగితే ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న కేఎల్ రాహుల్ కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇలా దాదాపు 7 మంది కెరీర్ మొత్తం వైభవ్ చేతిలో ఉండనుంది. అతడు వస్తే మాత్రం ఈ ఏడుగురికి ఇబ్బందిగా మారే ప్రమాదం కచ్చితంగా కనిపిస్తోంది.

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×