Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఐపీఎల్ లో నిన్న గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్ లో ఈ కుర్రాడు ఊచకోత కోచాడు. 35 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. మరోవైపు అతను ఈ సీజన్ ఐపీఎల్ లో తొలి బంతికే సిక్స్ బాది దేశ వ్యాప్తంగా మన్ననలు పొందాడు. ఐపీఎల్ కెరీర్ లో 3వ మ్యాచ్ లోనే 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ విజయం రాజస్థాన్ రాయల్స్ చాలా కీలకంగా మారింది. ఒక దశలో లీగ్ నుంచి వైదొలుగుతుందని.. ప్లే ఆప్స్ కి కూడా చేరుకోదు అనుకున్న సమయంలో విజయం సాధించి కాస్త ఆశలు చిగురించేలా చేశారు.
Also Read : Travis Head : ఆ తాగుడు ఏంటి.. అ బొర్ర ఏంటి..మాల్దీవ్స్ లో హెడ్ రెడ్డి అరాచకం
వీరి స్వస్థలం బీహార్ లోని సమస్తిపూర్. అక్కడి నుంచి సూర్యవంశీ క్రికెట్ జర్నీ స్టార్ట్ అయింది. టీ-20 క్రికెట్ కి కావాల్సిన టాలెంట్ అతని ఉంది. భారీ షాట్లను చాలా ఈజీగా ఆడేస్తున్నాడు ఈ కుర్రాడు. పవర్ పుల్ సిక్సర్లలో అలవొకగా బాదేశాడు. పాట్నా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వైభవ్ చాలా శ్రమించాడు. పదేళ్ల వయస్సు నుంచి అతను రోజుకు 600 బంతులు ఎదుర్కునేవాడట. నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడే తన తండ్రి ఇతనిలో ఉన్న టాలెంట్ ను గుర్తించి క్రికెట్ కి కోచింగ్ పంపిచాడట. ప్రాక్టీస్ కోసం అకాడమీకి వెళ్లడానికి రోజు 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించేవాడట. 16 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న బౌలర్లను నెట్స్ లో ఎదుర్కునేవాడట. తండ్రి సంజీవ్ రైతు. తన తండ్రి కొడుకు సూర్యవంశీ కోసం ఎక్స్ ట్రా టిఫిన్ బాక్స్ తీసుకొచ్చేవాడట. ప్రాక్టీస్ చేస్తున్న వారి కోసం అదనంగా 10 టిఫిన్ బాక్సులు తీసుకొచ్చేవాడట. వైభవ్ శిక్షణ తీసుకునే సమయంలో వాళ్ల రాత్రి 2 గంటలకు నిద్రలేచి టిఫిన్ తయారు చేసేది. ఆమె రాత్రి 11 గంటలకు నిద్రపోతుంది. ఆమె కేవలం 2 లేదా 3 గంటలు మాత్రమే నిద్రపోయినట్టు సమాచారం.
Also Read : Memes on RCB : RCBకి ఇదేం కర్మ రా.. కప్పు రావడం లేదని..వెల్డింగ్ షాప్ లో చేసుకున్నారు
ఇక వైభవ్ క్రికెట్ ఆశలను తీర్చేందుకు తండ్రి ఏకంగా తన భూమిని కూడా అమ్మేశాడట. వ్యవసాయ భూమిని అమ్మి కొడుకు కోసం ఖర్చు చేశాడట. గుజరాత్ మ్యాచ్ లో అతను కొట్టిన సెంచరీలో 11 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ సీజన్ లో ఇప్పటివరకు వైభవ్ కేవలం 3 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఈ టోర్నోలో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. భారీ షాట్లు ఈజీగా ఆడుతున్న వైభవ్ 3 మ్యాచ్ ల్లో మొత్తం 151 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 75.05 కాగా.. స్ట్రయిక్ రేట్ 222.05 గా ఉంది. వైభవ్ ఫామ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే టీమిండియా క్రికెట్ కి కూడా ఆరంగేట్రం చేసే అవకాశం ఉంది. టీమిండియాకి ఎంట్రీ ఇచ్చి ఇలాంటి కీలక ఇన్నింగ్స్ లు ఆడి జట్టు విజయం లో కీలక పాత్ర పోషించాలని అభిమానులు కోరుకుంటున్నారు.