Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో…. సోమవారం రోజున కీలక మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Rajasthan Royals vs Gujarat Titans ) జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. సోమవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ రాజస్థాన్ రాయల్స్. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi )… దుమ్ము లేపాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి వైభవ్ సూర్య వంశీ చరిత్ర సృష్టించాడు.
Also Read: Vaibhav Suryavanshi: బుడ్డోడు అనుకున్నార్రా.. 14 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ సెంచరీ
11 ఏళ్ల వయసులోనే సిక్స్ లు కొట్టడం ప్రారంభించిన వైభవ్
గుజరాత్ టైటాన్స్ జట్టు పైన సెంచరీ చేయడంతో వైభవ్ సూర్య వంశీ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వైభవ్ సూర్య వంశీ చిన్నతనంలో… క్రికెట్ ఎలా ప్రాక్టీస్ చేశాడు… ఎలా ఐపీఎల్ టోర్నమెంట్ వరకు వచ్చాడు అనే దాని పైన కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 11 సంవత్సరాల వయసులో పొట్టి నిక్కర్ వేసుకొని.. ప్రాక్టీస్ మొదలుపెట్టాడు వైభవ్ సూర్య వంశీ.
తన చిన్ననాటి కోచ్ ఆధ్వర్యంలో… ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు వైభవ్ సూర్య వంశీ. తన ఇంటి దగ్గరే ఉన్న చిన్న గ్రౌండ్ లో… ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అలా ప్రాక్టీస్ చేస్తూ… కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని చూసిన నేటిజన్స్.., క్రికెట్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ 14 ఏళ్ల బుడ్డోడు చిన్నప్పటి నుంచే చాలా కష్టపడ్డాడని పొగుడుతున్నారు. ఇలాంటి క్రికెటర్ టీమిండియాలోకి రావాలని కూడా స్పష్టం చేస్తున్నారు.
Also Read: Shubman Gill Sister: గిల్ సెంచరీ చేయాలని.. ఈ అందమైన అమ్మాయి ఏం చేసిందంటే
ఆరేళ్ల వయసులోనే క్రికెట్ స్టేడియానికి వైభవ్
ఆరు సంవత్సరాల వయసులోనే వైభవ్ సూర్య వంశీ క్రికెట్ అంటే ఎగబడి చూసేవాడు. అలాంటి సూర్య వంశీ… ఆరు సంవత్సరాల వయసులోనే ఐపిఎల్ చూడడం కూడా ప్రారంభించాడు. అది కూడా తన కుటుంబ సభ్యులతో స్టేడియానికి వెళ్లేవాడు. వైభవ్ ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ సమయంలో ఐపిఎల్ 2017 టోర్నమెంట్ జరుగుతోంది. అంతేకాదు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్న రైసింగ్ పూణే సూపర్ జెంట్ జట్టు కూడా అప్పుడు ఉంది. ఆ సమయంలో RPS జట్టుకు సపోర్ట్ గా నిలుస్తూ మ్యాచ్లకు కూడా వెళ్లేవాడు వైభవ్ సూర్య వంశీ. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఆరేళ్ల వయసులోనే క్రికెట్ స్టేడియం కి వెళ్ళాడు…. 11 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టి సిక్స్ కొట్టడం మొదలుపెట్టాడు… ఇక 14 ఏళ్ల వయసులోనే ఐపిఎల్ లో తొలి సెంచరీ కూడా చేశాడని కామెంట్ చేస్తున్నారు.
#vaibhavsuryavanshi at the age of 11 😯 pic.twitter.com/iRoo87Ir0R
— Richard Kettleborough (@RichKettle07) April 29, 2025