Virat Kohli : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. విరాట్ కోహ్లీ గత ఏడాది టీ-20 వరల్డ్ కప్ విజయం సాధించిన తరువాత రిటైర్డ్ అయ్యాడు. ఇటీవలే టెస్ట్ క్రికెట్ కి కూడా గుడ్ బై చెప్పాడు. 36 ఏళ్ల వయస్సులో అత్యంత ఫిట్ నెస్ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. చాలా ఏళ్లు ఆర్సీబీ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. కానీ టైటిల్ ని అందించలేకపోయాడు. కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఇప్పటివరకు ఆర్సీబీ 3 సార్లు ఫైనల్ కి వెళ్లి టైటిల్ ని చేజార్చుకుంది.
Also Read : Pant Mad Celebrations: రిషబ్ పంత్ సెంచరీ..గ్రౌండ్ లోనే సర్కస్.. గంగలో కలిసిన RCB ఆశలు
విరాట్ కోహ్లీ తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. శారీరక వ్యాయామం నుంచి తినే తిండి, తాగే నీటి విషయంలో కూడా అత్యంత కేర్ తీసుకుంటాడు. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి కోహ్లీ 2018 నుండి శాకాహారిగా మారిపోయాడు. అతను చేపలు, మాంసం ప్రోటీన్లను వదులుకోవడంతో పాటు, పాల ఉత్పత్తులను కూడా తగ్గించాడు. ఒక ఇంటర్వ్యూలో విరాట్ మాట్లాడుతూ, తాను సాధారణంగా ఉడికించిన ఆహారాన్ని తింటానని చెప్పాడు. కానీ ఒక ప్రత్యేకమైన పాలు తాగేవాడని వెల్లడించాడు. ఆ పాలు ఏ ఆవు, గేదె, మేక, గొర్రెలవి కావు. నిజానికి, కోహ్లీ బాదం పాలు తాగుతాడు. బాదం పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది అతని ఫిట్‌నెస్‌లో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. కోహ్లీ తన కాఫీలో కూడా బాదం పాలు కలుపుకొని తాగుతాడు. మరోవైపు ప్రస్తుతం సిస్ ఎనర్జీ డ్రింక్ తాగుతున్నాడు. ఇది శరీరానికి పోషణ ఇస్తుంది. తీవ్రమైన వర్కౌట్.. గేమ్ ప్లే మధ్య మళ్లీ శక్తిని పొందడంలో సహాయపడుతుంది సిస్ ఎనర్జీ డ్రింక్. దీని ధర ప్రస్తుతం రూ. 4,999 గా ఉంది. కోహ్లీ ఒక్కసారి ఇంత ఖర్చు చేసి ఈ ఎనర్జీ డ్రింక్ ని తాగుతున్నాడా..? చర్చించుకోవడం విశేషం.
ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఇవాళ లక్నో తో విజయం సాధిస్తే.. టాప్ ప్లేస్ లోకి వస్తుంది. లేదంటే.. స్థానం యధావిధిగా ఉంటుంది. లక్నోతో మ్యాచ్ గెలిస్తే.. పంజాబ్ కింగ్స్ తో క్వాలిఫయిర్ 1 లో తలపడుతుంది. ఒకవేళ ఓడిపోయినట్టయితే.. ముంబై ఇండియన్స్ తో ఎలిమినేటర్స్ మ్యాచ్ లో తలపడనుంది. ఇవాళ కూడా ఆర్సీబీ ఓడిపోయినట్టే.. కప్ కూడా ఈ సారి మిస్ అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. విరాట్ కోహ్లీ కూడా సన్ రైజర్స్ తో ఓటమి తరువాత చాలా కసిగా కనిపిస్తున్నాడు. ఇటీవలే అయోధ్య కి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని అటు అభిమానులు, టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.