Digvesh Rathi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో… అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు… క్వాలిఫైడ్ వన్ లోకి దూసుకు వెళ్ళింది. దీంతో… ఇవాళ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో పంజాబ్ కింగ్స్ జట్టుతో… రసవత్తర పోరులో పాల్గొనబోతోంది రాయల్ చాలెంజర్స్. అయితే అంతకంటే ముందు లక్నోపై విజయం సాధించిన బెంగుళూరు… ఆరు వికెట్ల విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో… లక్నో బౌలర్ దిగ్విష్ మరో రచ్చ చేశాడు.
ALSO READ: Pant Mad Celebrations: రిషబ్ పంత్ సెంచరీ..గ్రౌండ్ లోనే సర్కస్.. గంగలో కలిసిన RCB ఆశలు
మన్కడింగ్ చేసి రచ్చ చేసిన దిగ్వేష్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం రోజున లక్నో వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడుతున్న జితేష్ కుమార్ ను అవుట్ చేసే ప్రయత్నంలో… లక్నో బౌలర్ దిగ్వేష్ పెద్ద కుట్రకే తెర లేపాడు. మన్కడింగ్ చేసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ జితేష్ కుమార్ ను ఔట్ చేయాలని .. ప్లాన్ వేశాడు.
నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న జితేష్ కుమార్ క్రీజు నుంచి బయటకు రాగానే బౌలింగ్ చేస్తున్న దిగ్వేష్ వెంటనే వికెట్లను బాదేశాడు. దీంతో థర్డ్ అంపైర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మన్కడింగ్ కారణంగా జితేష్ కుమార్ అవుట్ కాబోడని… నాటౌట్ అంటూ ప్రకటించారు. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు థర్డ్ అంపైర్.
మన్కడింగ్ రూల్స్ ఏంటి ?
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… దిగ్వేష్ కారణంగా ఈ రూల్ పై కొత్త చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఐసీసీ ప్రకటించిన రూల్స్ ప్రకారం… బంతిని పూర్తిగా వదిలిన క్రమంలో.. మన్కడింగ్ చేయాల్సి ఉంటుంది. 38.3.1.1 అనే రూల్ ప్రకారం… కచ్చితంగా బౌలర్ పూర్తిగా తన చేతిలో ఉన్న బంతిని రిలీజ్ చేసే దశ దాకా వెళ్లాలి. అప్పుడు మన్కడింగ్… కచ్చితంగా అవుట్ ఇస్తారు. కానీ జితేష్ శర్మ విషయంలో దిగ్వేష్ సింగ్ అలా చేయలేదు. అసలు బౌలింగ్ వేసినట్లే కనిపించలేదు. చేతులను అలా పైకి అని..మన్కడింగ్ చేశాడు దిగ్వేష్. దీంతో థర్డ్ అంపైర్ రూల్స్ పరిశీలించి… నాట్ అవుట్ గా ప్రకటించాడు.
అంతకుముందు నో బాల్ రచ్చ
మన్కడింగ్ కంటే ముందు ఓవర్ లో జితేష్ కుమార్ ను అవుట్ చేశాడు దిగ్వేష్. అయితే… అది నో బాల్ అంటూ అంపైర్లు ప్రకటించారు. బౌలర్ దగ్గర ఉన్న లైన్.. దాటి మరి బౌలింగ్ చేశాడు దిగ్వేష్. దీంతో దాన్ని నో బాల్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఫ్రీ హిట్ లభించింది. ఇంతకుముందు జీతేష్ శర్మ సిక్సర్ కొట్టేశాడు.
ALSO READ: Vigilance on HCA : SRH ఓనర్ కావ్య పాప కొంప ముంచిన HCA… బెదిరింపులు చేసి మరి!
This time in IPL there is a guy who is famous all the time…he doesn't care about his team whether they win or lose..👇
He is Mr Lathi
"Digvesh Rathi" "Jitesh Sharma" PBKS vs RCB "Not Out" "Qualifier 1" #RCBvsLSG Kohli #RishabhPant#RoyalChallengersBengaluru@StarSportsIndia pic.twitter.com/9ixj9SzGmr
— Anamika Hazarika (SUMU) (@Anamika1344202) May 27, 2025
That's the law for running out the batsman at the non striker end.
Digvesh had gotten to the highest point of his action and then stopped. Hence NOT OUT. pic.twitter.com/7Ar6E5xW5p
— Raju PP (@rajupp) May 27, 2025