E-Paper
Advertisement

OTT Movie : త్రివిక్రమ్ మెచ్చిన థ్రిల్లర్ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

OTT Movie : త్రివిక్రమ్ మెచ్చిన థ్రిల్లర్ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?
Advertisement

OTT Movie : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఇప్పటికీ అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్నాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ తో పాన్ ఇండియా లెవల్లో ఒక మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇది ఇలా ఉంటే, ఈ దర్శకున్ని ఒక తమిళ్ మూవీ అబ్బురపరచింది. ఒక తమిళ సినిమా తనకు బాగా నచ్చిందని, అందులో క్లైమాక్స్ అదిరిపోయిందని ఓ ఫంక్షన్ లో చెప్పకనే చెప్పాడు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

అరువి అనే 24 ఏళ్ల అమ్మాయిసమాజంలో సరిగ్గా ఇమడలేక, అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆమె జీవితంలో జరిగిన కొన్ని దారుణమైన సంఘటనలు తనని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు ఆమెపై ఒక రోజు లైం*గిక దాడి చేస్తారు. దీనివల్ల ఆమె సమాజంపై కోపంతో ఉంటుంది. అరువి తన కోపాన్ని వ్యక్తపరచడానికి ‘సొల్వధెల్లం సత్యం’ అనే రియాలిటీ షోలో పాల్గొంటుంది. ఈ షోలో ఆమె తనపై జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేస్తూ, ఆ దాడి చేసిన వ్యక్తులను ఎదుర్కొంటుంది. కానీ, కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ షో సెట్‌ను స్వాధీనం చేసుకుని, కొంతమంది తుపాకీతో బెదిరిస్తారు. అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురౌతుంది. ఇక ఆ తరువాత ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది.

హాస్పిటల్ లో ఆమెకు ఎయిడ్స్ సోకినట్లు తెలుస్తుంది. దీనివల్ల ఆమె శారీరకంగా, మానసికంగా మరింత కుంగిపోతుంది. ఇక ఆమె ఒంటరిగా ఒక గ్రామంలోకి వెళ్లిపోతుంది. అక్కడ ఆమె తన జీవితంలో జరిగిన అనుభవాలను, ఆలోచనలను ఒక వీడియోలో రికార్డ్ చేస్తుంది. తరువాత ఈ వీడియో ఆమె స్నేహితులకు చేరుతుంది. అది చూసిన స్నేహితులు ఆమెను కలవడానికి వస్తారు. చివరికి అరువికి న్యాయం జరుగుతుందా ? ఆమె జీవితం ఎలా వెళ్తుంది ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : నిర్మానుష్యమైన బీచ్ లో మనుషుల్ని టార్చర్ చేసే మాన్స్టర్… ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ మావా

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ తమిళ థ్రిల్లర్ మూవీ పేరు ‘అరువి’ (Aruvi).  2016 లో వచ్చిన ఈ మూవీకి అరుణ్ ప్రభు పురుషోత్తమన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ స్టోరీ ఒక యువతి జీవితంలోని సవాళ్లను, సమాజంతో ఆమె చేసే పోరాటం, ఆమె తీసుకునే తీవ్రమైన నిర్ణయాల చుట్టూ తిరుగుతుంది.  ఈ మూవీలో అదితి బాలన్ ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×