Vinod Kambli Divorce: టీమిండియా మాజీ క్రికెటర్… వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి చిన్న విషయంలోనూ కూడా వైరల్ అవుతున్నాడు వినోద్ కాంబ్లీ. ఈ మధ్యకాలంలో అనారోగ్యం పాలై ఆసుపత్రి లో చికిత్స కూడా పొందాడు వినోద్ కాంబ్లీ. అయితే అలాంటి వినోద్ కాంబ్లీ ( Vinod Kambli )….. గురించి ఆయన రెండవ భార్య ఆండ్రియా హెవిట్ ( Andrea Hewitt ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read: ICC Year List: ఐసీసీ క్రికెటర్స్ ఆఫ్ ద అవార్డు లిస్ట్ ఇదే.. బుమ్రా, స్మృతి మందానకు చాన్స్
తాను ఇప్పటికే వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) కి విడాకులు ఇచ్చే దానిని… కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల… వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చారు ఆయన రెండవ భార్య ఆండ్రియా ( Andrea Hewitt ). 2023 సంవత్సరంలోనే… వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) కి విడాకులు ఇవ్వాల్సి ఉండేదని… కానీ తన మనసు మార్చుకున్నట్లు తెలిపారు. తాగుడుకు బానిస అయిన… టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ( Vinod Kambli )… 2023 సంవత్సరంలో తనను చాలా ఇబ్బంది పెట్టాడని ఆమె పేర్కొనడం జరిగింది.
ఎన్నిసార్లు తాను చెప్పినా కూడా వినలేదని… అయినప్పటికీ విపరీతంగా తాగి ఇంటికి వచ్చేవాడని తెలిపారు. దాంతో విసిగి చెంది 2023 సంవత్సరంలోనే విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. కానీ వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) పరిస్థితి అప్పుడు బాగాలేదని… నేను అలా విడాకులు ఇచ్చి వెళ్లి ఉంటే వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని ఆమె పేర్కొనడం జరిగింది. ఆ సమయంలో నేను వదిలేస్తే ఒంటరివాడు అయ్యేవాడు… అది నన్ను బాధిస్తుంది… వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) తనకు ఒక బాబు లాంటివాడు. అలా వదిలి వేయడం నాకు నచ్చలేదు.. అందుకే ఆ సమయంలో విడాకుల విషయంలో వెనక్కి తగ్గినట్లు ఆయన భార్య ఆండ్రియా తెలిపారు.
Also Read:WTC – Pakistan: విండీస్ చేతిలో ఓటమి.. WTC లో అట్టడుగున పాకిస్థాన్ !
ఇది ఇలా ఉండగా మొదటి భార్య విడాకులు ఇచ్చిన తర్వాత.. టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ… రెండవ వివాహం చేసుకున్నాడు. 2006 సంవత్సరంలో… అందాల తార ఆండ్రియాను రెండవ పెళ్లి చేసుకున్నాడు వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ). ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహం కావడం విశేషం. ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలోనే వీరిద్దరి వివాహం జరిగింది. ఇక పెళ్లి అయిన తర్వాత ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అందులో కుమారుడు జీసస్ క్రిస్టియన్ కాంబ్లీ కాగా… అమ్మాయి పేరు జోహాన్న. అయితే ఇటీవల తన అనారోగ్యం కారణంగా వినోద్… ముంబైలో ఉన్న ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే సచిన్ టెండుల్కర్ తో పాటు టీమిండియా క్రికెటర్లు అతనికి సహాయం కూడా చేశారు.