Anchor Second marriage:ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ.. రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నారు. అలా ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు మొదలు క్రికెటర్ల వరకు ఎంతోమంది విడిపోతూ అభిమానులను షాక్ కి గురి చేస్తున్నారు.అయితే తాజాగా ఇండస్ట్రీలో యాంకర్ గా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ కూడా మొదటి భర్తతో విడాకులు తీసుకొని, ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయింది. అయితే రెండో పెళ్ళికి సంబంధించిన ఆ న్యూస్ ని ఈ ముద్దుగుమ్మ స్వయంగా బయట పెట్టడంతో అందరూ ఈ యాంకర్ కి విషెస్ తెలియజేస్తున్నారు. మరి ఇంతకీ ఆ యాంకర్ ఎవరు..? ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది? అనేది ఇప్పుడు చూద్దాం.
మొదటి భర్తతో పెళ్లి , విడాకులు..
ఈ మధ్యకాలంలో యాంకర్లు కూడా హీరోయిన్ లలాగే చాలా ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో కన్నడ టాప్ యాంకర్ అయినటువంటి చైత్ర వాసుదేవన్ (Chaitra Vasudevan) ఒకరు. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలియక పోయినప్పటికీ, కన్నడ ప్రేక్షకులకు మాత్రం ఈ యాంకర్ సుపరిచితురాలు. అలా కన్నడ ఇండస్ట్రీలో పలు షోస్ చేసి స్టార్ యాంకర్ గా దూసుకుపోతున్న చైత్ర వాసుదేవన్ తాజాగా రెండో పెళ్లికి రెడీ అయినట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అయితే చైత్ర వాసుదేవన్ కి మొదట పెళ్ళై విడాకులు అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ విడాకులు వచ్చిన సంవత్సరానికే రెండో పెళ్లికి రెడీ అయింది. మరి ఇంతకీ చైత్ర వాసుదేవన్ (Chaitra Vasudevan) పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు? ఆమె మొదటి భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది? అనే విషయానికి వస్తే.. “కన్నడ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న చైత్ర వాసుదేవన్ డిగ్రీ పూర్తవ్వక ముందే తల్లిదండ్రులు ఇంట్లో చూసిన పెళ్లి సంబంధాన్ని చేసుకుందట.అయితే తన ఇష్టం కూడా అడగకుండా అమ్మ నాన్నల ఇష్ట ప్రకారమే మొదట పెళ్లి చేసుకున్నాను. కానీ నా భర్త నన్ను మోసం చేశాడు. అయితే నా భర్త చేసిన మోసం తెలిసి మా పేరెంట్స్ కూడా షాక్ అయిపోయారు.నా మొదటి భర్త అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు” అంటూ తన మొదటి పెళ్లి గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది చైత్ర వాసుదేవన్.
రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన చైత్ర వాసుదేవన్..
ఇక 2023లో చైత్ర వాసుదేవన్ కి మొదటి భర్తతో విడాకులు వచ్చాయి. విడాకులు వచ్చిన వెంటనే ప్రియుడితో చెట్టాపట్టా లేసుకొని తిరిగిన చైత్ర వాసుదేవన్ ఈ ఏడాది గుడ్ న్యూస్ చెప్పింది. అయితే రీసెంట్ గా ప్యారిస్ లో తనకు కాబోయే భర్తతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంది చైత్ర వాసుదేవన్. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ వైరల్ అయిన కొద్ది రోజులకే చైత్ర వాసుదేవన్ తన పెళ్లికి సంబంధించి అఫీషియల్ న్యూస్ ని బయట పెట్టింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక గుడ్ న్యూస్ అభిమానులకి తెలియజేసింది చైత్ర వాసుదేవన్. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ చేసింది.. “నేను మీ అందరితో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను.. 2025లో నేను నా జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా వైవాహిక జీవితంలో ఒక బ్యూటిఫుల్ జర్నీ అని అనుకుంటున్నాను” అంటూ తన రెండో పెళ్లికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయట పెట్టింది చైత్ర వాసుదేవన్(Chaitra Vasudevan).ఇక యాంకర్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారడంతో చాలామంది సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే రెండో భర్తతో అయినా ఈమె జీవితం సజావుగా సాగాలి అని కామెంట్లు పెడుతున్నారు. ఇక చైత్ర వాసుదేవన్ కన్నడ ఇండస్ట్రీ లోకి కన్నడ బిగ్ బాస్ 7(Kannada Bigg Boss 7) లో కంటెస్టెంట్ గా వచ్చి ఇండస్ట్రీ.కి పరిచయమైంది.ఆ తర్వాత బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీతో కన్నడ ఇండస్ట్రీలో యాంకర్ గా మారి ప్రేక్షకులను అలరించింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">