BigTV English

OTT Movie : అమ్మాయి తలలో సూదులు… ఒక్కో సూదికి ఒక్కో దెయ్యం… చేతబడితో చెమటలు పట్టించే హర్రర్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయి తలలో సూదులు… ఒక్కో సూదికి ఒక్కో దెయ్యం… చేతబడితో చెమటలు పట్టించే హర్రర్ థ్రిల్లర్

OTT Movie : ఇండోనేషియన్ సినిమాలు బ్లాక్ మ్యాజిక్ ఆచారాలతో ఎక్కువగా సినిమాలు తీస్తుంటారు. వీటిని అక్కడి ప్రజలు ఎక్కువగా నమ్మడం కూడా ఒక కారణం కావచ్చు. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు నిజంగానే చేతబడులు పని చేస్తాయా అనే సందేహం కలుగుకుటుంది. అంతలా ఈ స్టోరీలలో లీనమైపోతారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాకూడా చేతబడి లాంటి కంటెంట్ తోనే వచ్చింది. భయంకరమైన ఆచారాలు, దెయ్యాల వంటి సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో 

ఈ ఇండోనేషియన్ హారర్ మూవీ పేరు ‘Susuk: Kutukan Kecantikan’. 2023 లో వచ్చిన ఈ సినిమాకి గినాంటి రోనా దర్శకత్వం వహించారు. ఇందులో హనా మలాసన్, ఎర్స్యా ఔరెలియా, జౌర్డీ ప్రనాత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇండోనేషియాలో నిషేధించిన Susuk అనే బ్లాక్ మ్యాజిక్ ఆచారం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం 2023 ఆగస్టు 31న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

లారస్ అనే అమ్మాయి జకార్తాలో ఒక వేశ్యగా జీవిస్తుంటుంది. తన అందం, ఆకర్షణతో బాగా డబ్బున్న క్లయింట్‌లతో గ్లామరస్ జీవితం గడుపుతుంది. ఆమె తన అందం కోసం “సుసుక్” అనే బ్లాక్ మ్యాజిక్ ఆచారాన్ని ఉపయోగిస్తుంది. ఈ ఆచారంలో సూదులను శరీరంలోకి పంపిస్తారు. దీనివల్ల ‘సుసుక్’ ఆమెకు మరింత అందం, అదృష్టాన్ని ఇస్తుంది. కానీ దీనికి కఠినమైన నియమాలు పాటించాల్సిఉంటుంది. ఆమె ఎవరితోనూ రిలేషన్ కంటిన్యూ చేయకూడదు. అలా చేస్తే శాపం ఆమెను వెంటాడుతుంది. లారస్ తన క్లయింట్‌తో సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటుంది. అతనికి ఈ విషయం నచ్చకపోవడంతో, ఆమెపై దాడి చేస్తాడు. ఈ ఘటనలో ఆమె ఒక భవనం నుండి పడి కోమాలోకి వెళుతుంది.

లారస్ సోదరి ఆయు, తన సోదరిని రక్షించడానికి జకార్తా నుండి స్వగ్రామంకు తీసుకెళ్తుంది. ఆమె స్నేహితుడు ఆర్మన్ సహాయంతో, లారస్‌ను ఒక సాంప్రదాయ షమన్ వద్దకు తీసుకెళ్తుంది. అయితే గ్రామంలోకి ప్రవేశించినప్పటి నుండి, ఆయు, ఆర్మన్ భయకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. ఇప్పుడు లారస్ శరీరం అసాధారణంగా ప్రవర్తిస్తుంది. ఆమె కోమాలో ఉన్నప్పటికీ, ఆమె శరీరం కదులుతుంది. ఆమె చుట్టూ ఒక దెయ్యం లాంటి శక్తి కనిపిస్తుంది. లారస్ పాటిస్తున్న సుసుక్ ఆచారం గురించి ఆయు తెలుసుకుంటుంది. లారస్ తన అందం కోసం ఈ ఆచారాన్ని ఎంచుకుంది, కానీ ఆమె ఒక నియమాన్ని ఉల్లంఘిస్తుంది. అందువల్లే ఈ సంఘటనలు జరుగుతుంటాయి.

ఈ గ్రామంలో, లారస్ చుట్టూ ఉన్న వారిపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. భయపడిపోయిన ఆయు, ఆర్మన్ షమన్ సాయం కోరతారు. సుసుక్ సూదులను తొలగించడం ద్వారా మాత్రమేఈ శాపాన్ని నివారించవచ్చని అతను తెలియజేస్తాడు. కానీ ఈ ప్రక్రియ చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల లారస్ జీవితం అంతటితో ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఆయు తన సోదరి కోసం అన్ని ప్రమాదాలను ఎదుర్కొని, సుసుక్ సూదులను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె భయంకరమైన దెయ్యం శక్తులతో పోరాడాల్సి వస్తుంది. చివరికి సుసుక్ బ్లాక్ మ్యాజిక్ నుంచి లారస్ బయట పడుతుందా ? ఆయు ఈ బ్లాక్ మ్యాజిక్ ను ఎలా ఎదుర్కుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : గ్రిప్పింగ్ నరేషన్… సీట్ ఎడ్జ్ ట్విస్టులు… త్రిష మలయాళ క్రైమ్ థ్రిల్లర్ క్లైమాక్స్ చూస్తే నిద్ర పట్టదు

Related News

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

OTT Movie : భర్త ఇంట్లో లేడని బాయ్ ఫ్రెండ్ ను పిలిచే భార్య… నెక్స్ట్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : రాత్రిపూట భర్త గదిలోకి వెళ్లాలంటేనే భయపడే భార్య… నాలుగురమ్మాయిల అరాచకం… సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : సాఫ్ట్వేర్ జాబ్ పేరుతో అమ్మాయిలతో ఆ పాడు యాపారం… కూతురు కూడా అదే పని… వర్త్ వాచింగ్ మూవీ

OTT Movie : మొదటి రాత్రే పెళ్ళానికి షాక్… భర్తకు మ్యాటర్ వీక్… కడుపుబ్బా నవ్వించే బ్లాక్ కామెడీ మూవీ

OTT Move: ‘అవెంజర్స్’ ను గుర్తుచేసే కొరియన్ సినిమా… చచ్చినోడి బాడీ పార్ట్స్ తో సూపర్ పవర్స్ .. కిరాక్ మూవీ

OTT Move: దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

Big Stories

×