Bangkok Pilla: ఈరోజుల్లో కేవలం రోజూవారీ పనులు చేసుకుంటూ వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే చాలు.. లక్షల్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి. అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం యూట్యూబ్ వీడియోలతో లాభాలు సంపాదిస్తున్నారు. కొందరు అయితే కేవలం ఈ యూట్యూబ్ వల్లే సెలబ్రిటీలు అయిపోయారు. అందుకే బ్యాంకాక్ పిల్ల ఒకరు. ఇండియా నుండి బ్యాంకాక్ వెళ్లి, ఫ్యామిలీతో సహా అక్కడే సెటిల్ అయ్యి యూట్యూబర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ బ్యాంకాక్ పిల్ల. బ్యాంకాక్‌లో జరిగే రోజూవారీ విషయాలను వీడియోలుగా తీసి ఫుల్ ఫేమస్ అయిపోయింది. తాజాగా భూకంపంలో తన ఇల్లు డ్యామేజ్ అయ్యిందని వీడియో చేసిన తర్వాత ఒక కొత్త విల్లానే తన ఇల్లుగా చూపిస్తూ తాజాగా మరో వీడియో అప్లోడ్ చేసింది.
బాధలో సబ్‌స్క్రైబర్లు
బ్యాంకాక్ లాంటి దేశాల్లో భూకంపం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. అలా తాజాగా జరిగిన భూకంపం కారణంగా బ్యాంకాక్ పిల్ల ఉంటున్న అపార్ట్మెంట్‌కు బీటలు వారింది. అసలు భూకంపం ఏ సమయానికి వచ్చింది, ఎంత తీవ్రతతో వచ్చింది, అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి.. ఇవన్నీ ఒక వీడియోలో చెప్తూ దానిని కూడా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది బ్యాంకాక్ పిల్ల. భూకంపం వల్ల తను ఉంటున్న అపార్ట్మెంట్ ఏమీ కూలిపోలేదు. కానీ బీటలు వారడం వల్ల ఏ క్షణంలో అయినా అది కూలిపోయే ప్రమాదం ఉంటుందేమో అని అక్కడ నివాసం ఉండే వారందరినీ ప్రభుత్వం ఖాళీ చేయించింది. దాంతో బ్యాంకాక్ పిల్లకు ఇల్లు లేకుండా పోయిందే అని తన సబ్‌స్క్రైబర్లు చాలా ఫీల్ అయ్యారు.
ప్రభుత్వం చొరవేనా.?
భూకంపం వల్ల అపార్ట్మెంట్ ఖాళీ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన తర్వాత రోడ్డున పడ్డామంటూ మరొక వీడియో అప్లోడ్ చేసింది బ్యాంకాక్ పిల్ల. దీంతో తన సబ్‌స్క్రైబర్లంతా వారి పరిస్థితి చూసి ఫీలయ్యారు. ఇప్పటికప్పుడు మరొక ఇల్లు ఎక్కడ దొరుకుతుంది, ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా అని తనతో పాటు తన సబ్‌స్క్రైబర్లు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. ఇక భూకంపం వచ్చి నెలరోజులు అవ్వక ముందే మరొక కొత్త విల్లాను వీడియో చూసి యూట్యూబ్‌లో కొత్త వీడియో అప్లోడ్ చేసింది బ్యాంకాక్ పిల్ల. దీంతో ప్రభుత్వమే కొత్త ఇల్లు ఇచ్చిందా అని సబ్‌స్క్రైబర్లలో డౌట్లు మొదలయ్యాయి. కానీ వీడియో సగం పూర్తయిన తర్వాత అసలు ఆ విల్లాపై క్లారిటీ ఇచ్చేసింది.
Also Read: రీబోర్న్ జర్నీరి మొదలుపెట్టా.. బ్రెయిర్ సర్జరీ అయినా తగ్గేదేలే అంటున్న అషు
అప్పుడే క్లారిటీ
తాజాగా బ్యాంకాక్ సిటీకి కాస్త దూరంలో ఒక పెద్ద విల్లాను చూపిస్తూ అందులో తాము షిఫ్ట్ అయిపోయామని చెప్పుకొచ్చింది బ్యాంకాక్ పిల్ల. పైగా ఆ విల్లాను మొత్తం తిప్పి చూపించింది. సోఫా, టీవీ, వాషింగ్ మెషీన్‌తో పాటు ఆ విల్లాలో అన్ని సౌకర్యాలు ముందు నుండే ఉన్నాయి. వాళ్లు కేవలం బట్టలు సర్దుకొని వచ్చేశామని చెప్పింది. అయితే సగం వీడియో పూర్తయిన తర్వాత ఆ విల్లాకు సంబంధించిన ఓనర్లు కూడా పక్కనే ఉంటారని చెప్పుకొచ్చింది బ్యాంకాక్ పిల్ల (Bangkok Pilla). దీంతో ఆ విల్లా తనకు అద్దెకు తీసుకుందనే విషయం క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి కొత్త విల్లాలోకి ఎంటర్ అయినందుకు తన సబ్‌స్క్రైబర్లంతా హ్యాపీగా ఫీలవుతున్నారు.