Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ కలిసి అయోధ్య కి వెళ్లారు. అక్కడ రామ మందిరాన్ని, హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు ఆలయ పూజరులు సంప్రదాయబద్దంగా ఆహ్వానించారు. ఆలయంలో ఈ జంట ప్రత్యేక పూజలు నిర్వహించింది. అలాగే హనుమాన్ గార్హి ఆలయ ప్రతినిధులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లను సత్కరించారు. ఈ జంటకు ప్రత్యేకమైన హనుమాన్ విగ్రహాన్ని అందించారు. అయోధ్యలోని విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ప్రత్యేక భద్రత మధ్య ఈ దంపతులు ఆలయం లోపలకు వెళ్లి వచ్చారు.
Also Read : Preity Zinta : “సిక్సర్” వివాదం.. థర్డ్ అంపైర్ పై ప్రీతి జింటా ఆగ్రహం
ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అయోధ్య కి వెళ్లడంతో అక్కడ ఆలయ ప్రాంగణం అంతా రద్దీగా మారింది. తమ అభిమాన క్రికెటర్ ను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఐపీఎల్ 2025లో కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే ప్లే ఆప్స్ కి చేరింది. ఈ సీజన్ లో కూడా కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగేది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంతో రెండో స్థానంలో ఉన్నటువంటి ఆర్సీబీ జట్టు మూడో స్థానానికి పడిపోయింది. రన్ రేట్ కాస్త తక్కువగా ఉండటంతో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలోకి వెళ్లింది. మరోవైపు ఇటీవలే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ కూడా ప్రకటించేశాడు. ఆర్సీబీ జట్టు తన చివరి మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తే.. టాప్ లోకి వెళ్తోంది. లేదంటే నాలుగో స్థానానికి పరిమితమయ్యే అవకాశముంది.
Also Read : Race to Top 2 : RCB కి బంపర్ ఆఫర్.. ప్లే ఆఫ్స్ లో ఇలా జరిగితే కప్ గ్యారంటీ
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత కోహ్లీ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఇప్పటికే పలు దేవాలయాను సందర్శించి.. పలువురు స్వామిజీల ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఇటీవల బృందావనంలోని సెయింట్ ప్రేమానంద మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ బిజీ షెడ్యూల్ మధ్య భార్య అనుష్క శర్మతో కలిసి మే 25న రామ్ నగరి అయోధ్య చేరుకున్నాడు. దాదాపు వెయ్యి సంవత్సరాల పురాతనమైన హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసాడు. అనుష్క తో కలిసి ఈ ఆలయంలో చాలా సమయం గడిపాడు. మే 27 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆతిథ్య జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. సన్ రైజర్స్ , లక్నోతో మధ్య మ్యాచ్ ల మధ్య 4 రోజుల గ్యాప్ దొరకడంతో విరాట్ అనుష్కతో కలిసి అయోధ్య కి వెళ్లాలని నిర్ణయించుకొని వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Virat Kohli and Anushka Sharma at the Hanuman Garhi Mandir in Ayodhya. ❤️
– This is Beautiful..!!!! pic.twitter.com/Ue5ROFHaHO
— Tanuj (@ImTanujSingh) May 25, 2025