Virat Kohli : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి విరాట్ కోహ్లీ కి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత పలు ఆధ్యాత్మిక సేవల్లో.. యూపీలో గురువు ప్రేమానంద్.. అలాగే అయోధ్యలోని అత్త గారింటికి వెళ్లడం.. ఇలా రకరకాల వార్తలు విరాట్ కోహ్లీ గురించి వైరల్ అయ్యాయి. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ టెన్త్ క్లాస్ మార్క్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోహ్లీ CBSE 10వ తరగతి మార్కుల షీట్ లో ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్ సబ్జెక్ట్ లలో మంచి మార్కులు సాధించాడు. ఆ మార్కులు చూస్తుంటే.. కోహ్లీ బ్యాడ్ స్టూడెంట్ కాదు.. చదువులో మంచి క్లెవర్ విద్యార్థి మాదిరిగానే అనిపిస్తోంది.
Also Read : Watch Video : రోహిత్ శర్మ పైకి దూసుకు వచ్చిన ఫ్యాన్.. జాతీయ జెండా పట్టుకొని మరి
కానీ మ్యాథ్య్, సైన్స్ ఇంట్రడక్టరీ ఐటీలలో తక్కువ మార్కులు వచ్చాయి. ఇంగ్లీషు, సోషల్ సైన్స్ లో వరుసగా A1, A2, హిందీలో B1, సైన్స్ C1, మ్యాథ్య్ ఇంట్రడక్టరీ ఐటీలో C2 వచ్చాయి. అతనికి అత్యధిక మార్కులు ఇంగ్లీషులో 83, సోషల్ సైన్స్ లో 81 మార్కులు వచ్చాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ మార్కుల షీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్ లు ఆడి.. 30 సెంచరీలతో సహా 9,230 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ గా గత ఐదేళ్లుగా క్రీజులో సుదీర్ఘంగా పోరాడి స్పెల్ గా భావించిన తరువాత టెస్ట్ ల నుంచి వైదొలిగాడు. దీంతో విరాట్ కోహ్లీ టెన్త్ క్లాస్ కి చెందిన మార్కుల షీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వాస్తవానికి 600 మార్కులకు 419 మార్కులు సాధించాడు కోహ్లీ. ఇక ఈ వివరాలను IAS అధికారి జితిన్ యాదవ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు.
Also Read : IPL – WWE : ఫైనల్స్ లో బెంగళూరు… కాల యముడిలా సిద్ధంగా ఉన్న ముంబై
జతిన్ యాదవ్ మార్కుల షీట్ ను షేర్ చేస్తూ.. ” మార్కులే ముఖ్యం అనుకుంటే.. ఇప్పుడు దేశం మొత్తం విరాట్ కోహ్లీ వెనుక ఉండేది కాదు. అభిరుచి, అంకిత భావం” అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ తో చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఇదే. జీవితంలో చదువు ఎంతో ముఖ్యం. చదువుతో జ్ఞానం పొందుతాం. అంతేకానీ.. మార్కులు, ర్యాంకులు అంటూ పిల్లల వెంట తల్లిదండ్రులు, టీచర్లు అస్సలు పడొద్దు. పిల్లలు కూడా మార్కులను అంత సీరియస్ గా తీసుకోకూడదు. తమ అభిరుచికి తగినట్టు ఆ రంగంలో 100 శాతం సక్సెస్ అవుతాం అనుకుంటే ఆ రంగాన్ని ఎంచుకోవాలి. విద్యార్థికి ఇష్టం ఉన్నది ఒకటి.. తమ తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నది ఒకటై.. తల్లిదండ్రుల మాట కాదనలేక.. తన ఇష్టాన్ని వదులుకోక ఇబ్బందులు పడేటటువంటి వారు చాలా మంది ఉంటారు. చదువులో రాణించకపోయిన ఏరంగంలో రాణిస్తే.. ఆ రంగం పై ఎఫర్ట్ పెట్టి మంచి సక్సెస్ సాధించాలి. ఇందుకు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకోవచ్చు.