Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ప్రస్తుతం ముంబైలో చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 2025 టోర్నమెంట్ పూర్తయిన తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ముంబైలోనే ఎక్కువగా గడుపుతున్నారు విరాట్ కోహ్లీ. అయితే ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ… ముంబై గల్లీలో తిరుగుతూ… జనాలతో కలిసి పోతున్నారు. అయితే తాజాగా.. ఓ చిన్నారికి ఆటోగ్రాఫ్ ఇచ్చి… ఆమె కోరిక తీర్చాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ).
కారులో ఉన్నప్పటికీ కూడా… అద్దాలు కిందకు దించి… ఓ అమ్మాయికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. గతంలో విరాట్ కోహ్లీ తో దిగిన ఫోటోను ఆర్ట్ వేసి.. ఆల్బమ్ తీసుకువచ్చింది సదరు చిన్నారి. ఇక ఆల్బమ్ చూడగానే వెంటనే…. కారు అద్దం దించి… దానిపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే సదరు అమ్మాయి డ్రాయింగ్ ఆర్టిస్ట్ అని తెలుస్తోంది. ఇక విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వగానే… ఆ చిన్నారి తెగ సంబరపడిపోయింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన… క్రికెట్ ఫ్యాన్స్ అలాగే నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ముంబై లో ఇదే ముంబైలో ఆర్మీ అధికారికి ( Army Jawan )… సెల్ఫీ (Selfi ) ఎందుకు ఇవ్వలేదు విరాట్ కోహ్లీ ? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ కారులో ఉన్నప్పటికీ కూడా… అద్దాలు కిందకు దించి… ఓ అమ్మాయికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. దింతో జవాన్ అయితే ఒక తీరులా విరాట్ కోహ్లీ ( Virat Kohli ) వ్యవహరిస్తున్నాడని… అమ్మాయి అయితే మరొకల వ్యవహరిస్తున్నాడని మండిపడుతున్నారు.
Also Read: Michael Clarke: పెళ్ళాలను కాకుండా.. లవర్లను తీసుకుపోవాలా..? బీసీసీఐపై మాజీ కెప్టెన్ సీరియస్ ?
ఒక జాతీయ క్రీడాకారుడు అయి ఉండి ఇలా వ్యవహరించడం ఎంత మేరకు సమంజసం అంటూ సోషల్ మీడియా వేదికగానే క్రికెట్ అభిమానులు అలాగే నేటిజన్స్ నిలదీస్తున్నారు. ఇంకా కూడా ఇండియన్ ఆర్మీ జవాన్ కు… విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పలేదని గుర్తు చేస్తున్నారు అభిమానులు. ఇది ఇలా ఉండగా రెండు రోజుల కిందట… ఇదే ముంబైలో… ఓ ఆర్మీ జవాను సెల్ఫీ అడిగితే ఇవ్వలేదు విరాట్ కోహ్లీ. సెల్ఫీ ఇవ్వకపోగా… అతన్ని ఏదో వింతలా చూశాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ).
దానికి సంబంధించిన వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వెంటనే… ఇండియన్ ఆర్మీకి విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ దీనిపై ఇప్పటివరకు విరాట్ కోహ్లీ స్పందించలేదు. ఇది ఇలా ఉండగా… ఆస్ట్రేలియా టూర్ లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఒకటి రెండు ఇన్నింగ్స్ లో తప్ప ఇక్కడ రాణించలేదు విరాట్ కోహ్లీ.
Also Read: Venkatesh Iyer Injury: KKRకు బిగ్ షాక్.. రూ. 23.75 కోట్ల ప్లేయర్ ఐపీఎల్ కు దూరం ?
Virat Kohli signed an artwork of a fan. ❤️pic.twitter.com/w3EFgch3aQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 23, 2025