E-Paper
Advertisement

బ్యాట్ తో కోచ్ చాపెల్ పై వీరేంద్ర సెహ్వాగ్ దాడి..అడ్డుకున్న రాహుల్ ద్రవిడ్ ?

బ్యాట్ తో కోచ్ చాపెల్ పై వీరేంద్ర సెహ్వాగ్ దాడి..అడ్డుకున్న రాహుల్ ద్రవిడ్ ?
Advertisement

Virender Sehwag  physical fight with Greg Chappell: టీమిండియా హెడ్ కోచ్ గా పని చేసిన గ్రెగ్ చాపెల్ చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు. టీమిండియాను పూర్తిగా ఆయన డిస్టర్బ్ చేసినట్లు ఇప్పటికీ మాజీ క్రికెటర్లు చెబుతూ ఉంటారు. సౌరవ్ గంగూలీ నుంచి మొదలుకొని వీరేంద్ర సెహ్వాగ్ వరకు అందరి కెరీర్స్ తో ఆడుకున్నారని సోషల్ మీడియాలో ఇప్పటికి ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా వీరేంద్ర సెహ్వాగ్, గ్రెగ్ చాపెల్ మధ్య జరిగిన గొడవ వైరల్ గా మారింది. సింగిల్స్ కూడా తీయలేని దద్దమ్మ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ను అప్పట్లో గ్రెగ్ చాపెల్ విమర్శలు చేశాడట. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహానికి లోనై… కోచ్ గ్రెగ్ చాపెల్ పై దాడికి ప్రయత్నించాడని సమాచారం. బ్యాట్ తో కొట్టేందుకు వెళ్లగా అప్పటి టీమిండియా కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అడ్డుకున్నట్టు కథనాలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

అసలు వీరేంద్ర సెహ్వాగ్, గ్రెగ్ చాపెల్ వివాదం ఏంటి?

2006 సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ ఫామ్ కోల్పోయి… అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి క్రమంలో ఫుట్ వర్క్ సరిగ్గా లేదని…సిక్సర్లు తప్ప సింగిల్స్ తీయలేని వాడంటూ వీరేంద్ర సెహ్వాగ్ ను ఉద్దేశించి గ్రెగ్ చాపెల్ అప్పట్లో కామెంట్ చేశాడట. అయితే దానికి వెంటనే వీరేంద్ర సెహ్వాగ్ కూడా బదులు ఇచ్చాడు. 50 యావరేజ్ తో 6000 పరుగులు చేశాను… ఇంకేం చేయాలి… ? తనకు ఇలాగే బ్యాటింగ్ చేయవచ్చు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చినట్టు నివేదిక‌లు చెబుతున్నాయి. సిక్సర్లు, బౌండరీలే కాదు… సింగిల్స్ ఫాస్ట్ గా తీసే బ్యాటర్లు తమకు కావాలంటూ ఘాటుగా గ్రెగ్ చాపెల్ రిప్లై ఇచ్చాడట. ఇక ఈ మాటలు విన్న వీరేంద్ర సెహ్వాగ్.. తాను ఇదే ఫుట్ వర్క్ తో ట్రిపుల్ సెంచరీలు, డబుల్ సెంచరీలు, సెంచరీలు బాదినట్టు కౌంటర్ ఇచ్చాడని స‌మాచారం.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

లేదు, నీకు క్రికెట్ చేత‌కాదు… నిన్ను వెస్టిండీస్ టూర్ నుంచి తొలగిస్తానని హెచ్చరించాడట కోచ్ గ్రెగ్ చాపెల్. దీంతో రెచ్చిపోయిన వీరేంద్ర సెహ్వాగ్, గ్రెగ్ చాపెల్ పై బాట్ తో దాడి చేసేందుకు ప్రయత్నించినట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే అంతలోనే రాహుల్ ద్రావిడ్ జోక్యం చేసుకొని గొడవ ఆపినట్టు సమాచారం. దీంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. వీరేంద్ర సెహ్వాగ్ ఒక్క‌డితోనే కాదు, సౌర‌వ్ గంగూలీను కూడా గెలికాడు. టీమిండియా వాతావ‌ర‌ణం డిస్ట‌ర్బ్ చేస్తున్నాడ‌ని, అత‌న్ని జ‌ట్టు నుంచి త‌ప్పించాల‌ని బీసీసీఐకి మెయిల్ కూడా గ్రెగ్ చాపెల్ పెట్టాడు. ఈ వివాదం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయింది. అయితే, గ్రెగ్ చాపెల్ అంశాన్ని సీరియ‌స్ గా తీసుకున్న గంగూలీ, అత‌న్నే బ‌య‌ట‌కు పోయేలా చేశాడ‌ని ఇప్ప‌టికీ చెబుతూ ఉంటారు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Tags

Related News

అభిషేక్‌, ఇషాన్ ఫ్లాట్ పిచ్ హీరోలే…ఫ‌ర్హాన్ కాలి గోటికి కూడా పనికిరారు

4వ స్థానంలో దూబే క్లిక్ అయింటే, 300 కొట్టేవాళ్లం..బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై గంభీర్ సంచ‌ల‌నం !

గంభీర్‌ను తిడతారు కానీ, అతడే లేకపోతే టీమిండియా ప్లేయర్లు అడుక్కుతినేవారు ?

టీమిండియా బతికి బయట పడాలంటే మా ముస్లిం బౌలర్లనే దింపాలి !

టీమిండియాపై షాయ్ హోప్ ఊచకోత..ట్రావిస్ హెడ్‌కు కొత్త టెన్షన్

ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం పక్కా..ఇక అన్ని సిక్సర్లు, బౌండరీలే!

హార్ధిక్ పాండ్యా, బుమ్రా లేకపోతే..టీమిండియాను ఉగాండా కూడా చిత్తుగా ఓడిస్తుంది

Big Stories

Advertisement
×