E-Paper
Advertisement

నమ్మినవాడే వెన్నుపోటు.. డ్రాగన్లతో రణరంగం.. చివర్లో ఊహించని విషాదం

నమ్మినవాడే వెన్నుపోటు.. డ్రాగన్లతో రణరంగం.. చివర్లో ఊహించని విషాదం
Advertisement

House of the Dragon Season 3 OTT: ఇనుప సింహాసనం కోసం ఒకే కుటుంబానికి చెందిన ఫ్యామిలీ మెంబర్స్ యుద్ధం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పోరాటంలో డ్రాగన్లు రంగంలోకి దిగితే? నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిచి, ఒక్కో కీలక పాత్ర విషాదాంతం వైపు వెళ్తే? ఇలాంటి ఉత్కంఠభరిత పరిణామాలతో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ (House of the Dragon) సీజన్ 3 ముగిసింది. టార్గేరియన్ కుటుంబంలో సింహాసనం కోసం మొదలైన వారసత్వ పోరు ఈ సీజన్‌లో మరింత భీకరంగా మారింది. టంబుల్టన్ యుద్ధం, డ్రాగన్ల విధ్వంసం, కుటుంబ కలహాలు, వెన్నుపోట్లు, విషాదకరమైన మరణాలతో సీజన్ 3 ఫినాలే రాబోయే చివరి సీజన్‌పై మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ఈ సీజన్ మొత్తం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అసలు ఈ సీజన్ లో ఏం జరిగింది ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇనుప సింహాసనం కోసం రైనిరా, ఏగాన్ వర్గాల మధ్య మొదలైన పోరాటం సీజన్ 3లో మరింత ప్రమాదకరంగా మారుతుంది. సింహాసనంపై ఎవరి హక్కు అనేది నిర్ణయించే స్థాయి నుంచి… ఎవరు చివరి వరకు ప్రాణాలతో మిగులుతారనే పరిస్థితికి యుద్ధం చేరుకుంటుంది. రెండు వర్గాలు తమ సైనిక బలాన్ని పెంచుకుంటూ, డ్రాగన్ రైడర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తాయి.

Advertisement

ఈ క్రమంలో టంబుల్టన్ ప్రాంతం కీలకమైన యుద్ధభూమిగా మారుతుంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరులో డ్రాగన్లు రంగంలోకి దిగడంతో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతాయి. ఆకాశంలో డ్రాగన్ల గర్జనలు, కింద సైన్యాల మధ్య రక్తపాతం.. టంబుల్టన్ యుద్ధాన్ని ఈ సీజన్‌లోనే అత్యంత కీలకమైన ఘట్టంగా నిలబెడతాయి.

ఈ యుద్ధంలో ఉల్ఫ్ ది వైట్ వ్యవహారం మరింత ఆసక్తిని పెంచుతుంది. రైనిరా వర్గం తరఫున డ్రాగన్ రైడర్‌గా మారిన ఉల్ఫ్ యుద్ధ సమయంలో తన విధేయతను నిలబెట్టుకోలేకపోతాడు. అతని చర్యలు రెండు వర్గాల సైన్యాల్లోనూ గందరగోళాన్ని సృష్టిస్తాయి. సిల్వర్‌వింగ్‌తో కలిసి అతను సృష్టించే విధ్వంసం యుద్ధాన్ని మరింత భయంకరంగా మారుస్తుంది.

Advertisement

మరోవైపు రైనిరా తన అధికారాన్ని కాపాడుకోవడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సింహాసనం కోసం జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయం కాదని… దాని వెనుక కుటుంబ బంధాలు, వ్యక్తిగత ప్రతీకారాలు, విధేయతలు ఉన్నాయని ఆమె ప్రయాణం స్పష్టం చేస్తుంది. మరోవైపు డెమన్ కూడా యుద్ధంలో మరింత దూకుడుగా మారడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయి.

అయితే సీజన్ ముగింపులో ప్రేక్షకులను షాక్‌కు గురిచేసే పరిణామం హెలెనా టార్గేరియన్‌కు ఎదురవుతుంది. బందీగా ఉన్న హెలెనా తన చుట్టూ జరుగుతున్న రక్తపాతం, కుటుంబంలో చోటు చేసుకుంటున్న విషాదాలతో తీవ్రంగా కలత చెందుతుంది. చివరకు ఆమె తీసుకునే విషాదకరమైన నిర్ణయం టార్గేరియన్ కుటుంబంపై మరో భారీ దెబ్బగా మారుతుంది. ఆమె మరణం రాబోయే పరిణామాలు మరింత డార్క్ గా ఉండబోతున్నాయనే సంకేతాన్ని ఇస్తుంది.

ఇంతటి విధ్వంసం తర్వాత రైనిరా, ఏగాన్, డెమన్, అలిసెంట్‌ల భవిష్యత్తు ఏంటి ? ఇప్పటివరకు తమవాళ్లుగా భావించిన వారిలో చివరి వరకు ఎవరు నమ్మకంగా ఉంటారు ? ఇనుప సింహాసనం కోసం జరుగుతున్న ఈ యుద్ధం ఇంకా ఎన్ని ప్రాణాలను బలి తీసుకుంటుంది ? అనే ప్రశ్నలను మిగిల్చేలా సీజన్ 3 ముగుస్తుంది.

ఏ ఓటీటీలో చూడవచ్చు ?

డ్రాగన్ల యుద్ధాలు, రాజకుటుంబ కుట్రలు, వెన్నుపోట్లు, భారీ యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా ఈ సీజన్‌లో బలంగా కనిపిస్తాయి. ముఖ్యంగా టంబుల్టన్ యుద్ధం, ఉల్ఫ్ వ్యవహారం, హెలెనా విషాదాంతం వంటి కీలక పరిణామాలు కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఇప్పటికే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ప్రపంచాన్ని ఇష్టపడిన వారికి ఈ సీజన్ మరింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.

‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3’ ప్రస్తుతం జియోహాట్‌స్టార్లో (JioHotstar) స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 21న ప్రారంభమైన ఈ సీజన్‌లో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఆగస్టు 9న చివరి ఎపిసోడ్ ప్రసారమైంది. సీజన్ 3 తర్వాత కథ నేరుగా చివరి దశకు చేరుకోనుండటంతో, రాబోయే సీజన్ 4పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సీజన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది.

టార్గేరియన్ కుటుంబంలో సింహాసనం కోసం మొదలైన పోరాటం ఇప్పుడు మరింత రక్తపాతంగా మారింది. డ్రాగన్లు, యుద్ధాలు, కుట్రలు మాత్రమే కాదు.. నమ్మినవాళ్లే శత్రువులుగా మారడం ఈ కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. సీజన్ 3 ఫినాలే రాబోయే చివరి సీజన్‌కు బలమైన పునాది వేయడంతో, రైనిరా వర్సెస్ ఏగాన్ యుద్ధం చివరకు ఎక్కడికి చేరుకుంటుందో తెలుసుకోవాలంటే సీజన్ 4 కోసం ఎదురుచూడాల్సిందే.

Read Also: వెకేషన్‌లో ప్రియుడు మిస్సింగ్… వెతుకుతూ వెళ్తే అతడి అసలు బండారం బట్టబయలు

Tags

Related News

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

11 ఏళ్ల క్రితం మాయమైన కూతురు… కట్ చేస్తే క్రేజీ ట్విస్ట్… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ

రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే

ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా

Big Stories

Advertisement
×