Virender Sehwag On Team India Head Coach: టీమిండియా (Team India) డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ అన్న సంగతి తెలిసిందే. మైదానంలో అడుగు పెట్టిన నుంచి… వికెట్ పడే వరకు మనోడు సిక్సర్లు, బౌండరీలు బాదుతూనే ఉంటాడు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటాడు. అలాంటి వీరేంద్ర సెహ్వాగ్ కు టీమిండియా హెడ్ కోచ్ పదవి ఆఫర్ రాగా, దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓవరాక్షన్ భరించలేక..తాను ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తాజాగా వెల్లడించారు వీరేంద్ర సెహ్వాగ్. అనిల్ కుంబ్లేతో విరాట్ కోహ్లీ గొడవ పడ్డ నేపథ్యంలో తనకు టీమిండియా హెడ్ కోచ్ పదవి నచ్చలేదని… గుర్తు చేశారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2017 సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గా అనిల్ కుంబ్లే ( Anil Kumble) పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ క్రమంలోనే అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ ( Virat Kohli) మధ్య తరచూ గొడవలు జరిగేవి. కోహ్లీ ప్రవర్తన నచ్చక… అనిల్ కుంబ్లే తన పదవికి రాజీనామా చేశారని ఇప్పటికీ ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ను తీసుకోవాలని అప్పటి బీసీసీఐ సెక్రటరీ అమితాబు చౌదరి ( Amitabh chaudary), విరాట్ కోహ్లీ ఓ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఈ ఆఫర్ ను వీరేంద్ర సెహ్వాగ్ వెంటనే రిజెక్ట్ చేశారట. తాజాగా అదే విషయాన్ని స్పష్టం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు వీరేంద్ర సెహ్వాగ్.
2017 సమయంలో తనకు టీమిండియా హెడ్ కోచ్ పదవి ఆఫర్ వచ్చిందని వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశారు. అయితే విరాట్ కోహ్లీ ప్రవర్తన తనకు నచ్చక… బీసీసీఐ ముందు కొన్ని కండిషన్లు పెట్టినట్లు గుర్తు చేశారు. అసిస్టెంట్ కోచ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లతో పాటు ఫిజియో ట్రైనర్ లను సైతం తనకు నచ్చిన వాళ్లను మాత్రమే ఎంపిక చేసుకునే హక్కు, పూర్తి స్వేచ్ఛను తనకు ఇవ్వాలని బీసీసీఐ ముందు డిమాండ్ చేసినట్లు వీరేంద్ర సెహ్వాగ్ ( Virendra Sehwag) వెల్లడించారు. కానీ తన కండిషన్ ను బీసీసీఐ ( BCCI) రిజెక్ట్ చేసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను కూడా కోచ్ పదవిని వదలుకున్నట్లు వివరించారు. వీరేంద్ర సెహ్వాగ్ తప్పుకోవడంతో, ఆ తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టారు.