Virender Sehwag: ప్రజెంట్ జనరేషన్ లో క్రికెట్ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ లలో కూడా టి-20 మ్యాచ్ ఆడుతున్నట్లుగా బ్యాటింగ్ చేస్తున్నారు. కానీ దశాబ్దం క్రితం టెస్టు క్రికెట్ అంత ఈజీ కాదు. అలాంటి సమయంలోనే భారత డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లను విపరీతంగా బాదేసేవాడు. భారత క్రికెట్ జట్టులో విధ్వంసకర ఓపెనర్ గా పేరుగాంచిన సెహ్వాగ్ బ్యాటింగ్ శైలి వినూత్నంగా ఉంటుంది. ఈ విధ్వంసంకర ప్లేయర్ తన ఆటతీరుతో ఎంతోమందిని ఎంటర్టైన్ చేసేవాడు.
Also Read: Kohli-Pietersen: పీటర్సన్ కొడుక్కి విరాట్ కోహ్లీ అదిరిపోయే గిఫ్ట్ !
టీమిండియా కు రెండు వరల్డ్ కప్పులు అందించిన జట్టులో సభ్యుడుగా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత.. మళ్లీ జట్టు ఆ స్థాయి ఓపెనర్ ని తయారు చేయలేక పోయింది. సాధారణంగా క్రికెట్ ఆడే వాళ్ళలో ప్రతి ఒక్కరు తమ ఫుట్ వర్క్ ని ఎంతో కొంత కదుపుతూ షాట్లను డిసైడ్ చేసుకుంటారు. కానీ సేహ్వగ్ బ్యాటింగ్ స్టైల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. నిలుచున్న చోటు నుండి ఒక్క అంగుళం కూడా కదలకుండా భారీ షాట్లు ఆడేయగలడు. తన ఆటతో క్రికెట్ కి వన్నెతెచ్చిన ప్లేయర్ సెహ్వాగ్. ప్రపంచ క్రికెట్ లో ఇతడు డేంజరస్ ప్లేయర్.
ఈ విషయాన్ని స్వయంగా స్కాట్ స్టైయిడీస్ ఓ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ గురించి మాట్లాడుతూ.. ప్రపంచ క్రికెట్ లో ఉన్న బెస్ట్ బౌలర్లలో ఎవ్వరిని అడిగినా.. ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరిని అంటే సెహ్వాగ్ పేరే చెబుతారని అన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటివరకు వన్డేలలో సెహ్వాగ్ దే బెస్ట్ స్ట్రైక్ రేట్. అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేసిన క్రికెటర్.
ఎవరైనా బ్యాటింగ్ కి దిగగానే మొదటి బంతిని ఫోర్ కొడితే.. వీరేంద్ర సెహ్వాగ్ లాగా కొట్టాడు అని ఇప్పటికీ అనుకుంటారు. పవర్ ప్లే లో ప్రత్యర్థి బౌలర్లను డామినేట్ చేస్తే సెహ్వాగ్ లాగా ఆడుతున్నావని అంటారు. ఈ జనరేషన్ క్రికెటర్లకి ప్రస్తుతం టి-20 క్రికెట్ అలవాటు అయ్యి.. ప్రస్తుత బ్యాటర్ల ఆటను చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. కానీ వీరేంద్ర సెహ్వాగ్ గతంలోనే ఏ ఫార్మాట్ లో బ్యాటింగ్ కి దిగినా.. టి-20 బ్యాటింగ్ తో రెచ్చిపోయేవాడు.
Also Read: WPL 2025: నేటి నుంచి మెగా టోర్నీ ప్రారంభం..టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి ?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ చూడడం తనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని అన్నాడు. 1999లో తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ని పాకిస్తాన్ తో మొదలుపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్.. 2021 లో భారత టెస్టు జట్టులో చేరాడు. భారత జట్టు 2002 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2007లో టి-20 ప్రపంచ కప్, 2011లో క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా నిలవడంలో సెహ్వాగ్ కృషి ఎంతగానో ఉంది. వన్డేల్లో 251 మ్యాచ్ లు ఆడిన సెహ్వాగ్ 15 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇక 104 టెస్టుల్లో 23 సెంచరీలు, 32 హఫ్ సెంచరీలు బాదాడు. ఇలాంటి క్రికెటర్ ని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో బహుశా చూడలేమేమో.