Panchayat Power: భార్య సర్పంచ్‌గా గెలువగా భర్త అన్ని తానై గ్రామంలో అధికారం చెలాయిస్తున్నరని బందారం సంతోష్ అనే వ్యక్తి నిజమాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలసి అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రజావాణిలో ఆయన విన్నవించాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన సర్పంచ్ నీరడి జ్యోతి భర్త నిరడి రవి తానే సర్పంచ్ నంటు అధికారం చలాయించడమే కాకుండా, అధికార కార్యక్రమాలలో పాల్గొంటున్నాడని, ప్రశ్నిస్తే తానే సర్పంచ్ నని చెబుతున్నాడు అన్నారు. అడిగినందుకు టార్గెట్ చేసి షాపు వద్ద ఉన్న మంచినీటి నల్ల ను మూసి వేయించడం జరిగింది అన్నారు.
Also read: అనకాపల్లిలో అక్రమ వసూళ్ల చెక్‌పోస్ట్ కలకలం!
తనకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ, నచ్చని వారిని ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపనలు బలంగా వినిపించారు. అంతేకాకుండా గ్రమంలో సర్పంచ్ నిర్వహించే కార్యక్రమంలో తానే ఉండి చలామని అవుతున్నారని పేర్కోన్నారు. దీంతో ఎలాంటి అధికారం లేకున్నా సర్పంచిగా చలామణి అవుతున్న రవి పై అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నామన్నారు.
Also read: ప్రభుత్వ ఉద్యోగులకు మీరిచ్చే గౌరవం ఇదేనా.. కాంగ్రెస్ సర్కార్‌కు హరీశ్ రావు ఫైర్!