Cricketers Drink : మనం పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లినా లేదా నడక కోసం బయటకు వెళ్లినా వాటర్ బాటిల్ ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. నీరు లేకుండా కొన్ని గంటలు గడపడం కూడా కష్టంగా మారింది. నీరు ఎంత తాగితే అంత మంచిదని నిపుణులు కూడా సూచిస్తుంటారు. చాలా మంది బయట వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తుంటారు. క్రికెటర్లు ఐపీఎల్ మ్యాచ్ జరిగే సమయంలో రంగు నీళ్లను తాగుతుంటారు. అసలు వాటిలో ఏముంటుంది..? అని చాలా మందికి అనుమానం కలుగుతుంది. వాస్తవానికి ఐపీఎల్ మ్యాచ్ లు జరిగేటప్పుడు ఆట మధ్య లో బ్రేక్ సమయంలో క్రీడాకారులు వాటర్ తాగుతుంటారు. వారిలో కొందరూ నార్మల్ వాటర్ తాగితే మరికొందరూ రంగు నీళ్లు తాగుతుంటారు.
Also Read : Vaibhav Suryavanshi: బుడ్డోడు అనుకున్నార్రా.. 14 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ సెంచరీ
అయితే క్రికెటర్లు రంగు నీళ్లను తాగడానికి ప్రధాన కారణం ఆ నీరు ప్రత్యేకంగా తయారు చేయబడిన మినరల్ వాటర్ లేదా ఇతరుల నీరు తాగడం ద్వారా వారికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అందుబాటులో ఉంచడానికి. ఇక ఈ నీటితో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్రీడా సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. అందుకే క్రీడాకారులు తీసుకునే వాటర్ బాటిల్స్ లో ఎలక్ట్రోలైట్స్ టాబ్లెట్లు వేస్తుంటారు. అసలు వీటిలో ఏముంటాయంటే..? సాల్ట్, పొటాషియం, పాస్పెట్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలుంటాయి. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడం వల్ల శరీరం కండరాలు, అవయవాలు కీళ్ల పనితీరు పెరుగుతుంది. అందుకే శరీరం స్వయంగా ఉత్పత్తి చేయగల బైకార్బోనేట్ మినహా, మీరు తీసుకునే ఆహారం, పానీయాల నుండి ఎలక్ట్రోలైట్లు వస్తాయి. ఎలక్ట్రోలైట్స్ నీటిలో కరిగిపోతాయి. దీంతో చెమట ద్వారా శరీరం నీటిని కోల్పోయినప్పుడు శక్తి కోల్పోకుండా ఉంటుంది. అందుకే క్రీడాకారులు తీసుకునే వాటర్
లో ఎలక్ట్రోలైట్స్ టాబ్లెట్స్ వేస్తుంటారు.
Also Read : Natasa Stankovic : బాక్సర్ గా మారిన హార్థిక్ పాండ్యా.. ఇక రచ్చ రచ్చే
ఇక ఈ సీజన్ ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టు ప్రస్తుతం టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. నిన్నటి వరకు గుజరాత్ టాప్ ప్లేస్ లో ఉంటే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించి నెంబర్ వన్ స్థానానికి వచ్చింది. గుజరాత్ ఇవాళ రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయి రెండో స్థానానికి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. పిన్న వయస్కుడిగా రికార్డు నమోదు చేశాడు. అలాగే తక్కువ బంతుల్లో సెంచరీ చేసి ఇండియన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇవాళ సూర్య వంశీ తన పేరిట పలు రికార్డులను నమోదు చేసుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ కి ఓటమి తప్పలేదు. ఇక ఈ సీజన్ లో ఎవ్వరినీ అంచనా వేయలేకపోతున్నాం. ప్లే ఆప్స్ లోకి ఎవ్వరూ వెళ్తారో.. ఎవ్వరూ వెళ్లరో ఇంకా ఓ అంచెనాకు రాకపోవడం గమనార్హం.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">