BigTV English
Advertisement

Kavya Maran: ఎవరీ కావ్య మారన్..? IPLలో SRHకు ఆమెకు ఏమిటి సంబంధం..??

Kavya Maran: ఎవరీ కావ్య మారన్..? IPLలో SRHకు ఆమెకు ఏమిటి సంబంధం..??

SRH Co-Owner Kavya Maran: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లకు సంబంధించి క్రికెటర్ల ఆట తీరు, బౌలింగ్, అభిమానుల హర్షాతిరేకలకు సంబంధించిన వీడియోలు ట్రెండవుతున్నాయి. అదేవిధంగా క్రికెటర్ల ఆట తీరును చూస్తూ హుషారుగా ఆనందం వ్యక్తం చేస్తున్న ఓ యువతి వీడియోలు, క్రికెటర్లకు అభివాదం చేస్తున్న వీడియోలు, టీమ్ ఓడిపోయినప్పుడు ఆమె నిరాశకు గురైన వీడియోలు, ఆ సమయంలో ఆమెవైపు పలువురు హేళనగా చూస్తున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ఎవరు..? ఆమె వివరాలేంటి? ఆమె ఎందుకు ఐపీఎల్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది..? అనే వివరాలు తెలుసుకునేందుకు.. నెటిజన్స్ నెట్టింటా తెగ సెర్చ్ చేస్తున్నారంటా.


అయితే, ఆ యువతి పేరు కావ్య మారన్.. ఈమె క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్ లోని సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు.. తన తండ్రి కళానిధి మారన్ తో కలిసి ఆమె ఆ టీమ్ కు సహ యజమానిగా ఉన్నారు. అయితే, భారత్ లో అత్యంత సంపద కలిగిన యువ వ్యాపారవేత్తల్లో ఈమె ఒకరు. ఈమె 1992 ఆగస్టులో 6న చెన్నైలో జన్మించింది. ఈమెను అందరూ ముద్దుగా కావ్య అని పిలుచుకుంటారు. బిజినెస్ పై ఆసక్తితో ఆమె ఎంబీఏ పూర్తి చేశారు.

ఆమె ఆస్తులు రూ. 4 వేలకు పైగా కోట్లు ఉంటాయని చెబుతుంటారు. ఎస్ ఆర్ హెచ్ కు సహ యజమానిగా ఉన్న ఆమె ఎంతో చలాకీగా ఉంటారు. సన్ రైజర్స్ మ్యాచ్ లు ఎక్కడ జరిగితే ఆమె అక్కడికి వెళ్లి జట్టు ఆటగాళ్లకు హుషారు నింపే ప్రయత్నం చేస్తుంటారు. వారిని ఎంతగానో ప్రోత్సహిస్తుంటారు. ఆ క్రమంలో ఆమె క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపిస్తూ అందరినీ ఆకర్శిస్తుండే సరికి కెమెరాలు ఆమె వైపే ఫోకస్ పెడుతాయి. క్రికెట్ ఆటగాళ్లకు ఏ మాదిరిగానైతే అభిమానులు ఉన్నారో అదే మాదిరిగా ఈ కావ్య మారన్ కు కూడా అభిమానులు ఉన్నారు. కేవలం ఆమె కోసమే హైదరాబాద్ మ్యాచ్ లు చూసేవారు ఉన్నారు.


కావ్య మారన్.. తన టీమ్ గెలిచినప్పుడు, ఓడినప్పుడు చేసే ఎక్స్ ప్రెషన్స్, అదేవిధంగా తన టీమ్ క్రికెటర్లకు ఆమె హుషారు నింపే ప్రయత్నాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా గతంలో టీమ్ ఓడినప్పుడు ఇతర టీమ్ యజమానులు హేళనగా ఆమె వైపు చూస్తున్న సమయంలో ఆమె బాధపడుతున్న వీడియోలు, అదేవిధంగా ప్రస్తుతం తన టీమ్ చివరి పోరుకు చేరుకోవడంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ క్యూట్ క్యూట్ గా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ కనిపిస్తున్న వీడియోలు నెట్టింటా ప్రస్తుతం వైరల్ అవుతున్నారు.

Also Read: ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్, రూ. 2.07 కోట్లు

ఈ వీడియో చూసిన అభిమానులు కావ్య మారన్ పై ప్రశంసలు చేస్తున్నారు. ఈసారి విజయం పక్కా అంటూ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అయితే, మరో విషయం ఏమిటంటే.. సోషల్ మీడియాలో కావ్య మారన్ ఎక్కువగా కనిపించరు. ఆమె పేరు మీద సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్స్ లేకపోవడం గమనార్హం.

Tags

Related News

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Big Stories

×