E-Paper
Advertisement

Virat Kohli: విరాట్ కోహ్లీ దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు..పిలిచినా ఫైన‌ల్స్ కు రాలేదా ?

Virat Kohli: విరాట్ కోహ్లీ దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు..పిలిచినా ఫైన‌ల్స్ కు రాలేదా ?
Advertisement

Virat Kohli:  టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) విజేతగా టీమ్ ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, Final, ) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా 96 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ముచ్చటగా మూడవ సారి టైటిల్ అందుకుంది ఇండియా. అయితే టీమిండియా టైటిల్ గెలిచిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ కు పిలిచినా కూడా విరాట్ కోహ్లీ రాలేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Pak On Team India: అంతా ఫిక్సింగే..టీమిండియా విజ‌యం వెనుక‌ అమిత్ షా, ధోని, రోహిత్ కుట్రలు ?

విరాట్ కోహ్లీ దేశద్రోహి అంటూ విమర్శలు ?

Advertisement

ఇండియాలో పుట్టి పెరిగి, లండన్ లో సెటిల్ కాబోతున్న విరాట్ కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ( Narendra Modi Stadium, Ahmedabad ) జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియానికి మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మ ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. ఇప్పటికే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) బ్రాండ్ అంబాసిడర్ గా రోహిత్ శర్మ ( Rohit Sharma) ఉన్నాడు. దాంతోపాటు మహేంద్ర సింగ్ ధోనికి ( MS Dhoni) కూడా ప్రత్యేక ఆహ్వానం దక్కింది. అయితే వీళ్లతో పాటు విరాట్ కోహ్లీకి కూడా ఐసీసీ, బీసీసీఐ అలాగే మోడీ సర్కార్ నుంచి ఆహ్వానం వెళ్ళిందని చెబుతున్నారు. అయితే మూడు ఆహ్వానాలు వచ్చినా కూడా విరాట్ కోహ్లీ, నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని చెబుతున్నారు.

లండన్ లో ఉన్న విరాట్ కోహ్లీ, తన కుటుంబం తో గడపాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఫైనల్ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ హాజరు కాలేదని తెలుస్తోంది. అంతేకాదు ఫైనల్స్ లో టీమిండియా గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా స్పందించలేదని విమర్శలు చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో విరాట్ కోహ్లీ దేశద్రోహి అని మండిపడుతున్నారు. ఇండియాలో పుట్టి పెరిగి.. ఇక్కడి డబ్బులు సంపాదించి.. నీకు ఇంగ్లీష్ వాడి దేశమే కావాలా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఐపీఎల్ కు కూడా నువ్వు రిటైర్మెంట్ ఇచ్చి లండన్ లోనే ఉండిపో అంటూ కౌంటర్లు పేల్చుతున్నారు RCB ఫ్యాన్స్. అయితే ఈ విమ‌ర్శ‌ల‌పై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు. త‌న ఫ్యామిలీ చూసుకునే క్ర‌మంలో కోహ్లీ రాలేద‌ని, అందులో త‌ప్పేం ఉంద‌ని ఫైర్ అవుతున్నారు.

Advertisement

Also Read: Sahibzada Farhan: ఐసీసీని కోర్టుకు ఈడ్చుతా..నాకు ద‌క్కాల్సిన అవార్డ్, సంజుకు ఎలా ఇస్తారు ?

 

Related News

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

Big Stories

Advertisement
×