WTC Final – India: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ ( Border-Gavaskar Trophy 2024/25 ) ఆడుతున్న టీం ఇండియాకు భారీ ఊరట లభించింది అని చెప్పవచ్చు. గబ్బా వేదికగా జరిగిన… మూడవ టెస్టు డ్రా కావడంతో… టీమిండియా కు ( Team India) భారీ రిలీఫ్ లభించింది. దీనికి కారణం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ( World Test Championship). ఈ మ్యాచ్ డ్రా కావడంతో… డబ్ల్యూటీసీ ఫైనల్ ( World Test Championship)… బరిలో ఇప్పటికి కూడా టీమిండియా ఉంది. ప్రస్తుతం టీమిండియా… డబ్ల్యూటీసి పాయింట్స్ టేబుల్ లో… మూడవ స్థానంలో కొనసాగుతోంది.
రెండవ టెస్టులో ఓడిపోయిన తర్వాత కూడా మూడవ స్థానంలోనే ఉంది. ఇప్పుడు డ్రా అయిన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. అయితే ఆస్ట్రేలియా మాత్రం రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో సౌత్ ఆఫ్రికా జట్టు ఉంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక ప్రకారం.. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 114 పాయింట్లు ఉన్నాయి. అంటే విజయాల పర్సెంటేజ్ 55.88 గా ఉందన్నమాట.
Also Read: Team India WTC Schedule: WTC 2025-2027 టోర్నమెంట్ టీమిండియా షెడ్యూల్ ఇదే ?
దీంతో టీమిండియా ( Team India) మూడో స్థానంలో నిలిచింది. ఇక అటు సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సౌత్ ఆఫ్రికా ఖాతాలో ప్రస్తుతం 76 పాయింట్లు ఉన్నాయి. ఈ లెక్కన వాళ్ళ గెలుపు శాతం 63.33 గా ఉంది. దీంతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది సౌత్ ఆఫ్రికా. టీమిండియా పైన ( Team India) ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా… డబ్ల్యూటీసీ ( World Test Championship) పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 106 పాయింట్లు ఉన్నాయి. విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసి 58.89 గా ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం టీమ్ ఇండియా..వచ్చే రెండు టెస్టుల్లో కచ్చితంగా గెలవాలి.అప్పుడు… టీమిండియా కు మొదటి స్థానం దక్కడమే కాకుండా ఫైనల్ కు చేరుతుంది. అదే ఈ రెండు టెస్టులు ఓడిపోతే… టీమిండియా ఇంటి దారి పట్టడం ఖాయం.
అదే సమయంలో…. తమ సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాకు రెండు టెస్టులు ఉన్నాయి. అది కూడా పాకిస్తాన్ తో ( Pakisthan) రెండు టెస్టులు ఆడబోతుంది సౌత్ ఆఫ్రికా. ఇక్కడ సౌతాఫ్రికాను పాకిస్థాన్ ఓడించాలి. ఓడిస్తే… టీమిండియాకు ప్లస్ అవుతుంది. అటు ఆస్ట్రేలియా.. టీమిండియా తో సిరీస్ తర్వాత… శ్రీలంక పర్యటనకు వెళ్తుంది. ఈ రెండు సిరీస్ లు… టీమిండియా కు పెద్ద సవాల్ గా మారాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా.. పాకిస్తాన్ పైన సులభంగా గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇటు శ్రీలంక పైన ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు ఎక్కువ.
కాబట్టి ప్రస్తుతం టీమిండియా ముందున్న రెండు టెస్టులు…గెలవాల్సిందే. అప్పుడు సిరీస్ ఆస్ట్రేలియా పైన 3-1 తేడాతో టీమిండియా గెలుస్తుంది. దీంతో టీమిండియా గెలుపు శాతం 60.52 శాతానికి పెరుగుతుంది. అటు ఆస్ట్రేలియా విన్నింగ్ పర్సంటే 57% పడిపోతుంది. దీంతో డబ్ల్యూటీసి ఫైనల్ కు టీమిండియా… సులభంగా చేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మెల్బోర్న్, అలాగే సిడ్నీ టెస్టులలో టీమిండియా…మంచి ఆటతీరు కనబరిచాల్సి ఉంటుంది.