Big Stories

ZIM vs IND T20 : జింబాబ్వేతో మూడో టీ 20: ఆ ముగ్గురూ వచ్చేశారు

ZIM vs IND match latest updates(Live sports news): టీమ్ ఇండియాలోని ముగ్గురు ఆటగాళ్లు జింబాబ్వే చేరుకున్నారు. ప్రపంచకప్ గెలిచిన సంబరాల్లో పాల్గొన్న యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబె ముగ్గురు జట్టులో చేరారు. దీంతో మూడో వన్డేలో వారికి చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో వీరి బదులు జట్టులో చేరిన సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా ముగ్గురూ చోటు కోల్పోయారు.

- Advertisement -

అయితే రెండో టీ 20లో సాయి సుదర్శన్ కి అవకాశం వచ్చింది కానీ, బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు. దీంతో ఆడకుండానే జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల పెర్ ఫార్మెన్స్ ను బట్టి, తనకు మళ్లీ అవకాశం ఉండవచ్చునని అంటున్నారు.

- Advertisement -

ఇప్పుడు ఓపెనర్లుగా యశస్వి, గిల్ రానున్నారని అంటున్నారు. ఫస్ట్ డౌన్ అభిషేక్ శర్మ వస్తాడు. సెకండ్ డౌన్ రుతురాజ్, తర్వాత సంజూ శాంసన్, రింకూ సింగ్ ఇలా బ్యాటింగ్ ఆర్డర్ వెళుతుంది. తర్వాత వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ ఇలా ఉండవచ్చునని అంటున్నారు.

Also Read : టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌..భారీగా జీతం డిమాండ్!

మొదటి వన్డేలో వంద పరుగులు చేయడానికి అపసోపాలు పడిన టీమ్ ఇండియా కుర్రాళ్లు, రెండో మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఏకంగా 234 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ సెంచరీతో అదరగొడితే, రుతురాజ్ (77), రింకూ (48) చేసి నాటౌట్ గా నిలిచారు. రేపు పదో తేదీన జరిగే మూడో టీ 20లో మరెన్ని రికార్డులు నెలకొల్పుతారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

జింబాబ్వే బౌలింగు చాలా బాగుంది. కొంచెం జాగ్రత్తగానే ఆడాల్సి ఉంటుందని సీనియర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఆల్రడీ ఒక ఝలక్ తిన్నారు కాబట్టి, అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే, సిరీస్ పై ఆధిపత్యం వస్తుందని అంటున్నారు. అందుకని మూడో మ్యాచ్ రెండు జట్లకి కూడా కీలకంగా మారనుంది. ఎందుకంటే రెండు జట్లు చెరొకటి గెలిచి సమానంగా ఉన్నాయి. రేపటి మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించేది కావచ్చునని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News