E-Paper
Advertisement

మీరాలం చెరువు పనులపై సీఎం రేవంత్ ఆకస్మిత తనిఖీలు, అధికారులు పరుగో పరుగు

మీరాలం చెరువు పనులపై సీఎం రేవంత్ ఆకస్మిత తనిఖీలు, అధికారులు పరుగో పరుగు
Advertisement

Hyderabad City: మూసీ సుందరీకరణపై ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో మీరాలం చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ క్రేన్ ఎక్కి పైనుంచి మీరాలం చెరువు చుట్టూ జరుగుతున్న పనులను పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు చేశారు.

 

మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ ఫోకస్

Advertisement

హైదరాబాద్ సిటీలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా మీరాలం చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఉదయం స్వయంగా పరిశీలించారు. మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మిస్తోంది. దాని పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్న మౌలిక వసతులపై చర్చించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పేశారు. నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెరువు పరిసరాల అభివృద్ధి ద్వారా నగర ప్రజలకు పబ్లిక్ స్పేస్‌లు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Advertisement

 

మీరాలం చెరువు పనులపై సీఎం ఆకస్మిత తనిఖీలు

మీరాలం చెరువును ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కీలక నిర్మాణాలను చేపడుతోంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. చెరువు పరిసర ప్రాంతానికి ఆకర్షణ పెరగడంతోపాటు సందర్శకుల తాకిడి పెరిగే అవకాశముంది. చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్, మీరాలం నుంచి మూసీలోకి వరద వెళ్లేలా నాలాను విస్తరించాలన్నారు.

చెరువులో వాటర్ స్పోర్ట్స్‌ కోసం డిజైన్లు రూపొందించి, మధ్యలో ఐల్యాండ్‌ను డెవలప్ చేయాలన్నారు. ఉన్నట్లుండి సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మిక పర్యటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇకపై సీఎం ఎప్పుడు సడన్ గా పర్యటనకు వస్తారేమోనని అంటున్నారు. ఇకపై పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు చర్చించుకుంటున్నారు.

ALSO READ: నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్!

 

Related News

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

Big Stories

Advertisement
×