CID DSP news telangana(Telugu news headlines today): ఆయనో పోలీసు ఉన్నతాధికారి. ఓ మహిళను వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. అసలు విషయంలోకి వెళితే కిషన్ సింగ్ తెలంగాణ సీఐడీలో డీఎస్పీ హోదాలో ఉన్నారు. కిషన్ సింగ్ తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ TSSPDCLలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిషన్ సింగ్ పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు.
కిషన్‌సింగ్.. తన ఫోన్ కు అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపారని బాధితురాలు ఆరోపించారు. చీర కట్టుకుని ఉన్న ఫొటోలు పంపాలంటూ కోరారని పేర్కొన్నారు. పదే పదే మెసేజ్ లు చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించానని బాధిత మహిళా ఉద్యోగి ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల కార్యక్రమంలో కిషన్‌సింగ్ పరిచయమయ్యారని ఆ మహిళా ఉద్యోగి వెల్లడించారు.