Tiger was captured: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పెద్ద పులులు భయబ్రాంతులు గురి చేస్తున్నాయి. ఎప్పుడూ ఎక్కడో ఓ చోట పులులు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను పులులు గజగజ వణికిపోతున్నారు. ఏ సమయంలో ఎక్కడా పులులు ప్రత్యక్షమవుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో జిల్లా ప్రజలు అర చేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అధికారులు, ప్రభుత్వమే పులులను బంధించి తమను కాపాడాలని స్థానిక ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.
పులులు రాష్ట్రం దాటి వెళ్లిపోయానకునే తరుణంలో మళ్లీ ఎక్కడో ఓ చోట దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా పొలం పనుల్లో నిమగ్నమైన రైతులపై విరుచుకుపడుతున్నాయి. పులుల దాడిలో ఇప్పటికే కొమురం భీం జిల్లాకు చెందిన పలువురు మృత్యవాత పడ్డారు. దీంతో మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటు కాలం వెళ్లదీస్తున్నారు. కాగజ్ నగర్ డివిజన్‌లోనే పులుల సంచారం ఎక్కువగా కనిపిస్తోంది.
తాజాగా జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలో పెద్ద పులి చేతిలో విలేజ్ నెం.11 కి చెందిన మహిళా కూలీ మృత్యవాతపడింది. పత్తి చేనులో పని చేస్తున్న మహిళాపై పులి ఒక్కసారిగా పంజా విసిరి ప్రాణాలను తీసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల దుబ్బగూడలో ఓ రైతును, కివిట్ పేట్‌లో లక్కుబాయి అని మహిళను, వీరూర్ సమీపంలో ఓ గిరిజన వ్యక్తి ఇలా చాలామంది పులి చేతిలో మరణించారు. అయితే ఇవాళ మహారాష్ట్రలో ఫారెస్ట్ అధికారులు ఓ పులిని బంధించారు. ఆ బంధించిన పులి.. తెలంగాణలో పలువురిని ప్రాణాలు తీసిన పులి ఒక్కటే అని ప్రచారం జరుగుతోంది. ఫారెస్ట్ అధికారులు కూడా అదే పులి అని ధ్రువీకరించారు.
Agniveer vayu jobs: అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తు డేట్స్ వచ్చేశాయ్.. టెన్త్ పాసైతే చాలు..!
ఈ సీజన్‌లో పులులు జతకట్టడానికి కరెక్ట్ టైం కావడంతోనే తరుచూ పెద్దపులులు ఇక్కడికి వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆడ, మగ రెండు పులులు కూడ ఒకే మార్గంలో సంచరించే అవకాశం ఉందని.. గ్రామీణ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులులు సంచరిస్తుండడంతో కొమురంభీం జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పులులను బంధించి.. తమను రక్షించాలని జిల్లా ప్రజలు అధికారులను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.