Water Heater: మేడ్చల్ పరిధిలోని ఎల్లంపేట మున్సిపాలిటీ సోమారం గ్రామంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంట్లో వేసుకున్న వాటర్ హీటర్ హఠాత్తుగా పేలిపోవడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఒక ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
ఏం జరిగింది?
గ్రామానికి చెందిన బల్గురి మహేష్ స్నానం చేయడం కోసం ఇంట్లో వాటర్ హీటర్ ఆన్ చేసి కాసేపు బయటకు వెళ్లాడు. అదే సమయంలో ఆయన భార్య లావణ్య బయట బట్టలు ఉతుక్కుంటోంది. సరిగ్గా అదే సమయంలో హీటర్ తీవ్రమైన వేడికి ఒక్కసారిగా పేలిపోయింది. నిమిషాల వ్యవధిలోనే మంటలు గది అంతటా వేగంగా వ్యాపించాయి.
భారీగా ఆస్తి నష్టం
మంటల తీవ్రతకు ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. గదిలో ఉన్న సుమారు రెండున్నర క్వింటాళ్ల బియ్యం, బట్టలు, నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్ సామానులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు మహేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: మీసేవ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇక ఇంటికే వస్తారు! ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?
తప్పిన ప్రాణనష్టం
ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లోపల లేకపోవడం, చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులు త్వరగా అప్రమత్తం కావడంతో పెద్ద ప్రాణనష్టం తప్పిందని గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని తమ కుటుంబాన్ని ప్రభుత్వం సత్వరమే స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని బాధితుడు వేడుకుంటున్నాడు.
వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం
మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ సోమారంలో వాటర్ హీటర్ పేలడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. హీటర్ ఆన్ చేసి బయటకు వెళ్లిన సమయంలో మంటలు చెలరేగి క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో… pic.twitter.com/xJP3nWZfC8
— BigTV APP (@BigtvApp) September 23, 2026