E-Paper
Advertisement

మేం ఎన్నికలకు భయపడం.. ఖైరతాబాద్‌లోనూ కాంగ్రెస్‌దే గెలుపు: ఎంపీ చామల

మేం ఎన్నికలకు భయపడం.. ఖైరతాబాద్‌లోనూ కాంగ్రెస్‌దే గెలుపు: ఎంపీ చామల
Advertisement

Chamala Kiran: స్వేచ్ఛ బ్యూరో: గాంధీభవన్ సాక్షిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయంగా ఎదురయ్యే ఏ ఎన్నికలకైనా తాము సిద్ధంగా ఉన్నామని, అసలు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని, రాబోయే ఖైరతాబాద్ పోరులోనూ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

విద్యుత్ ప్రాజెక్టుల్లో భారీ అక్రమాలు..

Advertisement

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పవర్ ప్లాంట్ నిర్మాణాల పేరుతో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని చామల ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో సైతం నేతలు పెద్ద ఎత్తున కమీషన్లు దండుకున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే యాదాద్రి ప్లాంట్‌ను పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకువచ్చామని ఆయన స్పష్టం చేశారు.

సింగరేణికి పూర్వ వైభవం..

Advertisement

ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేసినట్లే, మరోవైపు రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్ల పరిస్థితిని కూడా అలాగే తయారు చేశారని ఎంపీ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి చెందిన కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి, సుమారు 18 గనులు మూతపడేలా చేశారన్నారు. అయితే కాంగ్రెస్ వచ్చాక సింగరేణిలో ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గులో 36 లక్షల మెట్రిక్ టన్నులకు మన రాష్ట్ర విద్యుత్ అవసరాలకే ఉపయోగిస్తున్నామని చెప్పారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: ఆయిల్ పామ్ రైతులకు ఊహించని షాక్.. కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్న మంత్రి తుమ్మల! 

Tags

Related News

కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి.. సజ్జనార్ తాట తీస్తాం.. పాడి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

ఏ వేళలో ఏ విగ్రహం? ఖైరతాబాద్, బాలాపూర్ గణపయ్యల నిమజ్జనం టైమింగ్స్, రూట్ ప్లాన్ ఇదే!

ఆయిల్ పామ్ రైతులకు ఊహించని షాక్.. కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్న మంత్రి తుమ్మల!

దానం అనర్హతతో తొలి వికెట్ పడింది.. మరిన్ని పడటం ఖాయం.. కేటీఆర్ ధ్వజం!

ఏసీబీ దూకుడు.. భీంరెడ్డి బినామీ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

సిరిసిల్లలో 8 వేల ఎకరాల భూవివాదం.. అసలు లెక్క తేలేదెప్పుడు?

నిమజ్జనాల్లో అమ్మాయిలను వేధిస్తే ఇదే గతి.. 1,530 మందిపై కేసులు నమోదు

Big Stories

Advertisement
×