E-Paper
Advertisement

థ్రిల్లింగ్ కోసం బీపీ ఇంజెక్షన్లతో.. మత్తును ఎక్కించుకుంటున్నయువత.. ఎలానో తెలుసా!

థ్రిల్లింగ్ కోసం బీపీ ఇంజెక్షన్లతో.. మత్తును ఎక్కించుకుంటున్నయువత.. ఎలానో తెలుసా!
Advertisement

Mephentermine Injection: ఇక్కడ కనిపిస్తున్నది Termin బ్రాండ్‌కు చెందిన మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్.. కామన్‌గా ఈ ఇంజెక్షన్‌ను సర్జరీలో అనస్థీషియా వాడిన తర్వాత బాడీలో ఒకవేళ బీపీ లెవెల్స్ పడిపోతే బీపీని నార్మలైజ్ చేయడానికి దీనిని ఉపయోగిస్తుంటారు. ఇది పూర్తిగా షెడ్యూల్ H ప్రిస్క్రిప్షన్ డ్రగ్. అయితే ఇటీవల ఈ డ్రగ్‌ను యువకులకు అమ్ముతున్న ముఠాను గుట్టురట్టు చేశారు ఆదిలాబాద్ పోలీసులు.

RMP షిండే జగన్నాథ్..

ఆదిలాబాద్‌కు చెందిన RMP షిండే జగన్నాథ్, జగదాంబ ఫార్మసీ ఏజెన్సీ నిర్వాహకుడు రమేష్, గెట్ వెల్ మెడికల్ యజమాని కమరుద్దీన్‌తోపాటు మరో నలుగురు కలిసి యువతకు ఈ ఇంజెక్షన్లను అక్రమంగా అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 390 రూపాయల ఇంజెక్షన్‌ను బానిసైన యువతకు 1500లకు అమ్ముతూ క్యాష్‌ చేసుకుంటున్నటున్నట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

విస్తృత సోదాలు..

Advertisement

హైలీ రిస్ట్రిక్టెడ్ మెడిసిన్ అక్రమ విక్రయాలపై అలెర్టయింది జిల్లా ఔషధ నియంత్రణ సంస్థ. ఆదిలాబాద్ పట్టణ వ్యాప్తంగా విస్తృత సోదాలకు డ్రైవ్ చేపట్టింది. రెండు ఫార్మసీలు మెడిసిన్‌ను మిస్ యూస్ చేశాయని గుర్తించి వారిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదించినట్లు వెల్లడించారు ఆదిలాబాద్‌ డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత.

Also read: 16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

ఎందుకు తీసుకుంటున్నారు?

Advertisement

సాధారణంగా మత్తులో మచ్ మోర్‌ను అన్వేషించే క్రమంలో యువత ప్రత్యామ్నాయంగా ఇతర మత్తునిచ్చే మెడిసిన్స్‌ను వాడడం చేయటం చూస్తుంటాం కానీ అసలు మత్తుకు సంబంధం లేని ఈ ఇంజక్షన్‌ను ఎందుకు తీసుకుంటున్నారు.? ఎందుకు ఈ మెడిసిన్‌కు అడిక్ట్ అవుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. ఈ ప్రయత్నంలో విస్తుపోయే అంశాలు తెలిశాయి. తాత్కాలిక మత్తు కోసం ఈ ఇంజక్షన్‌ను వాడుతున్నారని ఆదిలాబాద్ రిమ్స్ సైకాలజీ డిపార్ట్‌మెంట్ HOD డాక్టర్ ఓం ప్రకాష్ తెలిపారు. ఒకసారి అడిక్ట్ అయ్యాక అదిలేకపోతే బతకాలేమనే మానసిక స్థితికి చేరుకుంటారని హెచ్చరిస్తున్నారు.

యువతే టార్గెట్..

వివిధ మాధ్యమాల ద్వారా యువత మత్తు ఇంజక్షన్ల గురించి తెలుసుకొని అడిక్ట్‌ అవుతున్నారని అంటున్నారు ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్ మహాజన్. రిస్ట్రిక్టెడ్ మెడిసిన్‌ను అక్రమంగా విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నట్లు వారిని ఫైండ్ ఔట్ చేశామని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

థ్రిల్లింగ్ కోసం..

యువత మత్తు కోసం కొత్తదనాన్ని కోరుకునే క్రమంలో ప్రాణాంతకమైన మెడిసిన్లను సైతం వాడేందుకు వెనుకాడడం లేదనేది తెలుస్తోంది. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ థ్రిల్లింగ్ సాటిస్‌ఫ్యాక్షన్ కోసం పాకులాడుతున్న యువత.. చివరికి తల్లితండ్రులకు కడుపు శోకాన్ని మిగులుస్తున్నారు. ఇలాంటి విషయాలపై ఇంకాస్త గట్టి నిఘా, కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also read: సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×