BigTV English

Alekhya Reddy: కార్లలో నిద్రించిన రోజుల నుంచి.. నువ్వు ఒక వారియర్‌.. అలేఖ్య ఎమోషనల్‌ పోస్ట్‌

Alekhya Reddy: కార్లలో నిద్రించిన రోజుల నుంచి.. నువ్వు ఒక వారియర్‌.. అలేఖ్య ఎమోషనల్‌ పోస్ట్‌

Alekhya Reddy: మృత్యువుతో జరిగిన పోరాటంలో ఓడిపోయారు. తారక రత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హడావుడి చేసిన మీడియా.. ఇప్పుడు సైడ్ అయిపోయింది. జనం వేరే విషయాల్లో బిజీ అయిపోయారు. కానీ, ఇప్పటికీ తారకరత్ననే తలుచుకుంటోంది నందమూరి కుటుంబం. క్షణక్షణం నింగిలోని తారల్లో కలిసిపోయిన తారకరత్న ధ్యాసలోనే గడుపుతోంది భార్య అలేఖ్యరెడ్డి.


మరిచిపోదామంటే.. మరిచిపోయే మనిషి కాదు. ఆపుకుందామంటే కన్నీళ్లు ఆగడం లేదు. ఇంకా దు:ఖం తన్నుకొస్తోంది. బిడ్డను ఓదార్చుదామంటే.. తానే బాధలో మునిగిపోయి ఉంది. ఆకలేయడం లేదు. ఏమీ తినడం లేదు. తారకరత్న మరణంతో అర్థాంగి అలేఖ్య తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఆ బాధను బయటకు చెప్పుకుంటే అయినా.. కాస్త ఓదార్పు కలుగుతుందని భావించింది. భర్తపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది అలేఖ్య. తారకరత్నతో కలిసి చేసిన ప్రయాణాన్ని.. పోరాటాన్ని.. తీపిచేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

“జీవితంలో మనం ఎన్నో పోరాటాలు చేశాం. నీ చివరి రోజుల వరకు కలిసి ఫైట్‌ చేశాం. కార్లలో నిద్రించిన రోజుల నుంచి ఇప్పటివరకు.. మన జీవిత ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఈ పోరాటంలో మనం చాలా దూరం వచ్చేశాం. నువ్వు ఒక వారియర్‌ నాన్నా.. నువ్వు చూపించినంత ప్రేమ మాపై ఇంకెవ్వరూ చూపించలేరు” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తారకరత్న చేయి పట్టుకున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటో షేర్‌ చేసింది.


Related News

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

Big Stories

×