E-Paper
Advertisement

TG Tourism Department: పర్యాటక శాఖలో చక్రం తిప్పేందుకు ఓ అధికారి విశ్వప్రయత్నం.. చెక్ పెట్టిన మంత్రి..?

TG Tourism Department: పర్యాటక శాఖలో చక్రం తిప్పేందుకు ఓ అధికారి విశ్వప్రయత్నం.. చెక్ పెట్టిన మంత్రి..?
Advertisement

TG Tourism Department: పర్యాటక శాఖలో‘కర్నూలు’ మంత్రాంగం?
=ఈడీ పోస్టు ఇప్పించుకోవడం కోసం ఎండీ ప్రయత్నాలు
=తెలంగాణ అధికారికి చెక్‌.. సొంత జిల్లా వ్యక్తికి రెడ్‌ కార్పెట్‌
=‘మనవాడైతే చక్కదిద్దుకోవచ్చని’ ఎత్తుగడ?
=స్వయంగా ఫైలు తీసుకెళ్లిన ఎండీ
=ఈడీ పోస్టుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఓ అధికారి
=ఆరా తీసి మరీ పక్కన పెట్టిన మంత్రి జూపల్లి
=గాడిన పడుతున్న శాఖలో అదికారి బదిలీ తీవ్ర చర్చ
=ఎండీ తీరుపై సర్వత్రా విమర్శలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పర్యాటశాఖలో ‘కర్నూల్’ మంత్రాంగం మొదలైనట్లు ప్రచారం మొదలైంది. ఆశాఖ ఎండీ శాఖపరమైన నిర్ణయాలకంటే వ్యక్తిగత ఇష్టాయిష్టాలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాఖలో కీలకమైన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) పోస్టులో తన సొంత జిల్లా కర్నూల్ కు కు చెందిన వ్యక్తినే కూర్చోబెట్టుకునేందుకు ఆ శాఖ ఎండీ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ‘మనోడు ఉంటే.. ఏదైనా చక్కదిద్దుకోవచ్చు’ అన్న ధోరణితోనే ఎండీ పావులు కదుపుతున్నారని ముమ్మర ప్రచారం జరుగుతుంది.

తెలంగాణ అధికారిని కాదని..

Advertisement

తెలంగాణకు చెందిన వ్యక్తి ఈడీగా విధులు నిర్వహించారు. ఈ నెల రెండోవారం వరకు పనిచేశారు. అయితే ఆయన ఉండగానే జీహెచ్ఎంసీలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి(కర్నూల్ కు చెందిన)ని ఈడీగా నియమించేందుకు టూరిజంశాఖ ఎండీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈడీ ఉండగానే మరొకరిని అదనపు ఈడీ పోస్టును క్రియేట్ చేసి ఆ పోస్టులో నియమించే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయని గ్రహించిన తెలంగాణకు చెందిన వ్యక్తిగా ఈడీగా నిర్వహించిన ఆ అధికారి తన మాతృశాఖకు పంపాలని ఎండీని కోరగా అడిగిన వెంటనే సంతకం చేసి రిలీవ్ చేసినట్లు సమాచారం. ఈ ఈడీ పోస్టులో నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రాంతానికి చెందిన అర్హులైన అధికారిని నియమించాల్సి ఉంది. అయితే ఆ అధికారికి చెక్‌ పెట్టి, తన సొంత ప్రాంతం వాడిని తెచ్చుకునేందుకు ఎండీ గట్టి పట్టుదలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇద్దరూ ఒకే ప్రాంతం వారు అయితే పాలనలో తన మాటకు ఎదురుండదని ఎండీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

స్వయంగా మంత్రి వద్దకు ఫైల్ తీసుకెళ్లిన ఎండీ

టూరిజం శాఖలో ఈడీగా పనిచేస్తున్న వ్యక్తిని రిలీవ్ చేసినట్లు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కి కూడా తెలియదని సమాచారం. ఆశాఖ ప్రక్షాళన కోసం, గాడిలో పెట్టేందుకు టూరిజం శాఖను అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు మంత్రి చొరవ తీసుకొని తెలంగాణకు చెందిన వ్యక్తిని ఈడీగా నియమించినట్లు సమాచారం. అయితే ఎండీగా బాధ్యతలు తీసుకున్న కొన్ని నెలల పాటు టూరిజంను అభివృద్ధిబాటలో పెట్టారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఈడీ స్థానంలో కర్నూల్ కు చెందిన వ్యక్తిని తీసుకొచ్చేందుకు ఎండీ ప్రయత్నాలు షురూ చేశారు. అందులో బాగంగానే తెలంగాణకు చెందిన అధికారికి చాకచక్యంగా చెక్ పెట్టినట్లు సమాచారం. అయితే ఆ స్థానంలో సొంత ప్రాంతానికి(జిల్లాకు) చెందిన వ్యక్తిని నియమించేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. స్వయంగా ఎండీనే సంబంధిత ఫైల్ ను మంత్రి వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతిపాదించిన అధికారిపై ఆరా తీసినట్లు, పనితనం, టూరిజం శాఖ అభివృద్ధికి సహకారం అందిస్తాడా? సొంత ప్రచారం చేసుకుంటుండా తదితర వివరాలను మంత్రి తెలుసుకున్నట్లు సమాచారం. ఆ సమాచారం మేరకు ఆ ఫైల్ ను మంత్రి పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం.

Advertisement

Also Read: GHMC: జీహెచ్ఎంసీలో త్వరలో లోకల్ ట్రాన్స్ ఫర్స్… మళ్లీ ఔట్ సోర్స్ ఉద్యోగులకు బదిలీలు

ఇప్పటికే పలుమార్లు ప్రయత్నాలు

జీహెచ్ఎంసీ అడ్మిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి టూరిజం శాఖలో ఈడీ పోస్టు పోస్టుకోసం ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నం చేసినట్లు సమాచారం. మూడోసారి ఎండీతో ఫైరవీ స్టార్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ఎండీనే స్వయంగా మంత్రి సంతకం కోసం ఫైల్ తీసుకెళ్లినట్లు సమాచారం. అసలు ఎందుకు ఎండీ ప్రయార్టీ ఇస్తున్నారు? పనిచేస్తున్న వ్యక్తిని ఎందుకు రిలీవ్ చేశారనేది ఇప్పుడు టూరిజంశాఖలోనే విస్తృత చర్చజరుగుతుంది. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న సదరు అధికారి టూరిజం శాఖకు ఎందుకు రావాలని అనుకుంటున్నారు? ఆ అధికారి తాపత్రాయం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

టూరిజం గాడినపడుతున్న సమయంలోనే..

టూరిజంశాఖ కాంగ్రెస్ ప్రభుత్వంలో గాడిన పడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలతో మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishma Rao) ప్రత్యేక చొరవతో అభివృద్ధి బాట పట్టింది. శాఖలోని ఉద్యోగుల ప్రక్షాళనతోపాటు గతంలో జరిగిన అక్రమాలపై ఆడిటింగ్ చేపట్టారు. దుబారా ఖర్చుల నియంత్రణకు చర్యలకు శ్రీకారం చుట్టారు. టూరిజం ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. అంతా గాడిలో పడుతుందనుకున్న సమయంలో ఈడీ మార్పుతో ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. అసలు ఎందుకు రిలీవ్ చేశారు? సరిగ్గా పనిచేయడం లేదా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది సైతం హాట్ టాఫిక్ గా మారింది. అయితే శాఖ మంత్రి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేదానిపై శాఖ ఉద్యోగుల్లోనూ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎండీ సూచించిన వ్యక్తినే ఈడీగా నియమిస్తారా? మరో వ్యక్తిని ఈడీగా నియమిస్తారా? అనేది చూడాలి.

Also Read: Gandhi Hospital IVF: సర్కారీ ఆసుపత్రుల్లో సంతాన భరోసా.. నమ్మకంతో క్యూకడుతున్న జనం

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×