Big Stories

Bandi Sanjay : ఆ నోటీసులు అందలేదు.. వస్తే విచారణకు హాజరవుతా: బండి సంజయ్

Bandi Sanjay : ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ బండి సంజయ్‌ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది. విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది. బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసి.. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

- Advertisement -

మహిళా కమిషన్ నోటీసుల ప్రకటనపై బండి సంజయ్ స్పందించారు. తనకు ఇంకా మహిళా కమిషన్‌ నుంచి నోటీసులు అందలేదని అన్నారు. ఒకవేళ నోటీసులు వస్తే.. తప్పకుండా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ నేతల ఆందోళనల నేపథ్యంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులను భారీగా మోహరించారు. కార్యాలయానికి వచ్చే రెండు దారుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు.

- Advertisement -

తరుణ్ చుగ్ ఫైర్..
లిక్కర్‌ స్కామ్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలకు కేసీఆర్‌, సోనియా ఎవరైనా ఒక్కటే అన్నారు. లిక్కర్‌ స్కామ్ లో కవిత కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనన్నారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచేసిందని ఆరోపించారు. ఢిల్లీని దోచుకోవడానికి లిక్కర్‌ స్కామ్‌కు తెర తీశారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు నిజాలు నిగ్గు తేలుస్తున్నాయని చెప్పారు. అందుకే కేసీఆర్‌ కుటుంబం భయంతో వణికిపోతోందని అన్నారు. దోషులకు కఠిన శిక్షలు పడాల్సిందని తరుణ్‌చుగ్‌ స్పష్టంచేశారు.

FOR MORE UPDATES PLEASE FOLLOW : https://bigtvlive.com/telangana

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News