BigTV English

Delhi : ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం.. మోదీకి అల్టిమేటం.. ఢిల్లీలో రేవంత్ బీసీ గర్జన

Delhi : ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం.. మోదీకి అల్టిమేటం.. ఢిల్లీలో రేవంత్ బీసీ గర్జన

Delhi : బీసీ రిజర్వేషన్లను ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం.. బీసీల ధర్మయుద్ధం మొదలుపెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తాము ఢిల్లీకి రామని.. మోదీనే మా గల్లీల్లోకి రావాలని తేల్చి చెప్పారు.  మా డిమాండ్లకు దిగిరావాలి.. లేదంటే మీరు దిగిపోవాలంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు ఉండాల్సిందేనని.. అందుకే కులగణన చేపట్టి బీసీల లెక్క తేల్చామని రేవంత్ చెప్పారు. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశమని.. తెలంగాణ‌లో రిజ‌ర్వేష‌న్లు పెంచేందుకు మోదీకి ఎందుకు ఇబ్బందని సూటిగా ప్రశ్నించారు.


జంతర్‌మంతర్‌లో బీసీల మహాధర్నా

42 శాతం రిజర్వేషన్లు కావాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో బీసీల పోరు గర్జన మహాధర్నా చేపట్టింది.  బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్‌లోనూ ఆమోదించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ నేతలు ధర్నాకు తరలివచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కులగ‌ణ‌న చేప‌ట్టి.. బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు తీర్మానం చేశామన్నారు సీఎం రేవంత్. ఏడాది పాలన తిరగకముందే తెలంగాణలో కులగ‌ణ‌న పూర్తి చేసి బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు పెంచుతూ ఫిబ్రవరి 4న చట్టసభల్లో బిల్లులు పెట్టామని.. అందుకు గుర్తుగా ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డే గా ప్రకటించామని చెప్పారు.


మహాధర్నాకు ప్రాంతీయ పార్టీల సపోర్ట్

తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే ఠాకూర్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, వీహెచ్, అంజన్ కుమార్ గౌడ్ తదితరులు మహాధర్నాలో పాల్గొన్నారు. డీఎంకే తరఫున ఎంపీ కనిమొళి, ఎన్సీపీ నుంచి సుప్రియ సూలే, మజ్లిస్ అధినేత ఓవైసీ.. మహాధర్నాకు హాజరై మద్దతు తెలిపారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించి.. తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని వారంతా డిమాండ్ చేశారు. తెలంగాణలో చేసిన విధంగానే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని.. బీసీ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా సబ్ కోటా ఉండాలని అన్నారు.

ఢిల్లీలో దేత్తడి.. తెలంగాణ లొల్లి

బీసీ రిజర్వేషన్లు, కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం ఢిల్లీని షేక్ చేస్తోంది. ఈ రెండు అంశాలు మన రాష్ట్రంతో లింక్ ఉన్నవే కావడంతో.. హస్తినలో తెలంగాణం మారుమోగుతోంది. ఓవైపు కాంగ్రెస్ మిత్ర పక్షాలు.. మరోవైపు బీజేపీ శ్రేణులు.. జంతర్‌మంతర్ దగ్గర పోటాపోటీ ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో ఢిల్లీ హోరెత్తిపోతోంది.

HCU భూములపై ఢిల్లీలో బీజేపీ నిరసన

అటు.. బీసీల మహధర్నాకు కౌంటర్‌గా అన్నట్టు బీజేపీ ఎంపీలు అదే జంతర్‌మంతర్ దగ్గర HCU భూముల వేలం నిలిపివేయాలంటూ నిరసన చేపట్టారు. టీబీజేపీ ఎంపీలు ప్లకార్డులతో సేవ్ HCU అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీ మహాధర్నాకు వందలాదిగా నేతలు తరలివస్తే..  వర్సిటీ భూములపై బీజేపీ ఎంపీలు చేసిన నిరసనకు పట్టుమని 10 మంది కూడా రాలేదు.

ఢిల్లీలో మారుమోగుతున్న తెలంగాణం

ఇటు బీసీ కులగణన, అటు 400 ఎకరాల ల్యాండ్. తెలంగాణ పాలిటిక్స్ ఢిల్లీ స్థాయిలో కాక రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగానే తెలంగాణలో కులగణన చేసి చూపించారు సీఎం రేవంత్‌రెడ్డి. బీసీ జనాభాకు అనుగుణంగా 42 శాతం రిజర్వేషన్లకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసేలా చేశారు. కొన్ని నెలల గ్యాప్‌లోనే పని పూర్తి చేయడంతో యావత్ దేశం ఆశ్చర్యపోయింది. దేశవ్యాప్తంగా కులగణన, బీసీ రిజర్వేషన్లు కావాల్సిందే అంటూ డిమాండ్లు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎజెండాను తలకెత్తుకుంది. అది కష్టం.. కుదరదు.. అసాధ్యం అనే మాటే వినిపించకుండా.. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్‌గా చూపిస్తోంది. ఆ పోరాటాన్ని రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి లీడ్ చేస్తున్నారు.

Also Read : HCU భూముల విక్రయం.. బయటపడిన కేసీఆర్ బాగోతం

సీఎం రేవంత్‌రెడ్డి vs బీజేపీ

కులగణన, బీసీ రిజర్వేషన్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమేజ్ జాతీయ స్థాయిలో పెరిగిపోవడాన్ని బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నట్టున్నారు. అందుకే, కావాలనే కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమిపై వివాదం చేస్తున్నారు. ఆ 400 ఎకరాల్లో ఇంచు భూమి కూడా యూనివర్సిటీకి చెందింది కాదంటూ ప్రభుత్వం పక్కా పత్రాలతో క్లియర్ కట్‌గా చెబుతున్నా.. బీజేపీ నేతలు మాత్రం ఈ ఇష్యూను కావాలనే కాంట్రవర్సీ చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఫేక్ వీడియోలు, ఫోటోలతో సోషల్ మీడియాలో తెలంగాణ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడాన్ని తప్పుబడుతున్నారు.

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×