E-Paper
Advertisement

మగవాళ్లకు బిగ్ రిలీఫ్ .. గ్రేటర్ పరిధిలో కొత్తగా 75 సిటీ బస్సులు

మగవాళ్లకు బిగ్ రిలీఫ్ .. గ్రేటర్ పరిధిలో కొత్తగా 75 సిటీ బస్సులు
Advertisement

Telangana Rtc: మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో మహిళలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే నిత్యం రాకపోకలు సాగించే పురుషులు సాధారణ ప్రయాణికులకు బస్సుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు మొదలయ్యాయి. పరిస్థితి గమనించిన తెలంగాణ ఆర్టీసీ, పురుషుల ఇబ్బందిని నివారించడానికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది.

 

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

Advertisement

కొత్తగా 75 మెట్రో డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యింది. ఈ నిర్ణయం వల్ల రద్దీ వేళల్లో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడానికి ఉపయోగపడుతోంది. అందరికీ సీట్లు లభించనున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టనున్న మెట్రో డీలక్స్ బస్సుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది ఆర్టీసీ.

 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలొ కొత్తగా 75 సిటీ బస్సులు

Advertisement

 

ఈ బస్సుల్లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం వర్తించదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ మహిళలు ఈ బస్సులు ఎక్కితే మిగతా ప్రయాణికుల మాదిరిగా టికెట్ కొనుగోలు చేయాలి. ఇప్పటికే చెల్లుబాటులోవున్న ప్రత్యేక బస్ పాస్‌లు కలిగినవారు ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు అర్హులు. ప్రయాణికుల రద్దీని బట్టి కొత్త బస్సులను 45 లాంగ్ రూట్లలో నడపాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

 

పురుషులకు బిగ్ రిలీఫ్.. ఎందుకంటే

ప్రస్తుతం గ్రేటర్​లో 3,200 సిటీ బస్సులు నడుస్తున్నాయి. అందులో మెట్రో డీలక్స్​ బస్సులు 275 మాత్రమే ఉన్నాయి. మెట్రో ఎక్స్​ప్రెస్​, ఆర్డినరీ బస్సులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆయా కేటగిరీ బస్సులను మహిళలు ఉక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో పురుషులు.. మెట్రోరైల్, ఎంఎంటీఎస్, క్యాబ్, ఆటోల వైపు మొగ్గు చూపుతున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి.

ALSO READ: ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టుతో కాంగ్రెస్ హై అలర్ట్.. ప్రతిపక్షాలను దెబ్బకొట్టేందుకు సర్కార్ బిగ్ స్కెచ్!

ఈ విధంగా ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది. సిటీలో తిరుగుతున్న మెట్రో డీలక్స్​ బస్సులు కిక్కిరిసిపోతుండడంతో మరో 75 మెట్రో డీలక్స్ బస్సులను ప్రవేశ పెట్టబోతోంది. ఉన్న బస్సులకు అదనంగా 75 బస్సులను ప్రవేశ పెట్టడం వల్ల ట్రిప్పుల సంఖ్య పెరుగుతుందన్నది అధికారుల ఆలోచన. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×