E-Paper
Advertisement

రాజకీయంగా ఎదుర్కోలేకనే ముస్తఫాపై కుట్రలు: అంబటి రాంబాబు

రాజకీయంగా ఎదుర్కోలేకనే ముస్తఫాపై కుట్రలు: అంబటి రాంబాబు
Advertisement

Mustafa Arrest: వ్యాపార లావాదేవీలకు సంబంధించిన గొడవను రాజకీయం చేసి ముస్తఫా పై కేసులు పెట్టారని అంబటి రాంబాబు అన్నారు. ముస్తఫా, ఆయన కుమారుడికి బెయిల్ రాకుండా కావాలనే తీవ్రమైన సెక్షన్లు మోపారని ఫైర్ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ (SC/ST) అట్రాసిటీ కేసులతో సహా పలు అక్రమ సెక్షన్లను ఇందులో అక్రమంగా చేర్చారని ఫైర్ అయ్యారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి, నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తిపై ఇలా చేయడం దారుణం అని అన్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే ముస్తఫా పై ఇటువంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అంబటి ఫైర్ అయ్యారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం వరుసగా వైఎస్‌ఆర్‌సిపి నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

Also Read: అమ్మబాబోయ్.. జియో నుంచి అస్సలు ఊహించని ప్లాన్.. జస్ట్ రూ.175 కే 10 పైగా ఓటీటీలు!

కాకాణి గోవర్థన్ రెడ్డి..

Advertisement

వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని ఆనవాయితీగా మార్చుకుందని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
వైఎస్‌ఆర్‌సిపి తరఫున పనిచేసిన మాజీ మంత్రులు, శాసనసభ్యులను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా నేను, నా సహచర మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కుమారుడిపై కేసులు..

నెల్లూరు సెంట్రల్ జైలుకు వరుసగా వైఎస్‌ఆర్‌సిపి నాయకులను తరలించి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. దాదాపు 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా పనిచేసిన మృదు స్వభావి, వివాద రహితుడైన ముస్తఫా పై అక్రమ కేసులు బనాయించారు. ముస్తఫాతో పాటు ఆయన కుమారుడిపై కూడా పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు పెట్టి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారని అన్నారు. అక్రమ కేసులో అరెస్ట్ అయిన ముస్తఫాని, ఆయన కుమారుడిని పరామర్శించడానికి నెల్లూరు సెంట్రల్ జైలుకు వచ్చామని అన్నారు. జైల్లో ముస్తఫా ధైర్యంగా ఉన్నాడని తెలిపారు.

Advertisement

Also Read: కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి- మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Tags

Related News

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×