BigTV English

BJP: సర్పంచ్ ఎన్నికలపై బీజేపీ మస్త్ ఫోకస్.. ఇప్పటినుంచే పకడ్బందీగా ప్లాన్..!

BJP: సర్పంచ్ ఎన్నికలపై బీజేపీ మస్త్ ఫోకస్.. ఇప్పటినుంచే పకడ్బందీగా ప్లాన్..!

BJP: భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. త్వరలో జరిగే ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కానుంది. మొన్న జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించండంతో రెట్టింపు ఉత్సహాంతో ముందుకు సాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధిస్తే వచ్చే సాధారణ ఎన్నికల వరకు పార్టీ మరింత బలోపేతమవుతుందని అధిష్టానం భావిస్తుంది. పట్టు ఉన్న ప్రాంతాల్లో మరింత ఫోకస్ పెట్టి భారీ విజయాలు సాధించాలని ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి నుంచే వివిధ సమావేశాలతో పార్టీ నేతలు బిజీ బిజీ అవుతున్నారు.


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ  ప్రతి ఎన్నికల్లో.. ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకుంటు వస్తుంది.. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు గెలవకున్నా.. ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఇటు టీచర్స్ తో పాటు పట్టభద్రుల ఎన్నికల్లో భారీ విజయం సాధించింది.  ఉత్తర తెలంగాణపై ప్రభావం ఉండే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో.. పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. ఇదే ఉత్సాహాంతో.. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించాలని.. అధిష్టానం ప్లాన్ చేస్తుంది. రిజర్వేషన్ తో సంబంధం లేకుండా.. ప్రతిచోట పార్టీని బలోపేతం చేసి.. విజయం సాధించే విధంగా క్యాడర్ ను సమాయత్తం చేస్తుంది. అందులో భాగంగానే.. ప్రతి మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకు.. బాధ్యతలు అప్పగిస్తున్నారు. అయితే.. అవసరం ఉన్న చోట… చేరికలను ప్రోత్సహించాలని నేతలు చెబుతున్నారు. ఇప్పటికే.. గ్రామ స్థాయిలో.. పార్టీ బలహీనంగా ఉంది. ఆలాంటి ప్రాంతాల్లో.. ఇతర పార్టీలకు చెందిన నేతలను చెర్పించుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పట్టు ఉన్న ప్రాంతాల్లో మరింత పట్టు సాధించాలని వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. అదే విధంగా స్థానిక సమస్యలను ఫోకస్ పెట్టి.. ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు.


ఇప్పటి నుంచే బీజేపీ కీలక నేతలు బూత్ వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి బూతులో 51 శాతం ఓట్లు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల గురించి ఆలోచించకుండా.. రేపే ఎన్నికలు ఉన్నట్లు పని చేయాలని క్యాడర్ కి నేతలు పిలుపునిస్తున్నారు.. అదే విధంగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన నేత వారంలో ఒక్కసారి.. కార్యకర్తల సమావేశంలో పాల్గొనాలి. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఎక్కువ పర్యటనలు ఉండే విధంగా ప్లాన్ చేశారు. ముందుగా.. సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో.. గ్రామాల్లో బలమైన నేతలను గుర్తించే పనిలో ఉన్నారు. పార్టీ సింబల్ లేనప్పటికీ.. పార్టీ సానుభూతిపరులు అధికంగా గెలిచేందుకు పని చేయాలని కోరుతున్నారు. మొత్తానికి.. బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని సిద్ధం చేసుకొని.. ప్రజా క్షేత్రంలోకి దిగేందుకు సై అంటుంది.

ALSO READ: MLA Rajasingh: కొందరు ఫాల్తుగాళ్లు మా పార్టీ నుంచి పోతే.. అధికారం మాదే: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×