MLA Rajasingh: ఓవైసీ బ్రదర్స్ పైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు. పవిత్రమైన రంజాన్ మాసాన హిందువులపై ఓవైసీ సోదరులు విషం కక్కుతున్నారని ఫైరయ్యారు. ఓవైసీ ఓ మెంటల్ గాడు అంటూ ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు.
సొంత పార్టీ నేతలపై కూడా రాజాసింగ్ మరోసారి రెచ్చిపోయారు. ‘కొంతమంది ఫాల్తూ గాళ్లు మా పార్టీ నుంచి వెళ్లిపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు రాష్ట్రం నుంచి పారిపోయే మొదటి వ్యక్తి ఓవైసీనే. అసదుద్దీన్ ఒవైసీకి మెంటల్ వచ్చింది.. ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నా’ అని రాజాసింగ్ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కమలం పార్టీ అధికారంలోకి రాగానే ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశం వదిలిపోయేలా చేస్తామని ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్ ఇచ్చారు. లేదా తాను బీజేపీలో జాయిన్ అవుతానని అసదుద్దీన్ ఒవైసీ తమ నేతల కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. అప్పుడు మేం వదిలేస్తామని చెప్పుకొచ్చారు. పవిత్రమైన రంజాన్ పండగ సందర్బంగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేనిపోని కామెంట్స్ చేస్తున్నారని రాజాసింగ్ ఫైరయ్యారు.
ALSO READ: OFMK Recruitment: తెలంగాణలో ఆ జిల్లాలో ఉద్యోగాలు.. జీతం రూ.60,000.. ఈ అర్హత ఉంటే చాలు..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జమ్మికి నమాజ్ చేస్తే బాగుంటుంది అన్న యోగి ఆదిత్యనాథ్ మాటలకు అసదుద్దీన్ ఓవైసీకి రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో హోళీ పండగ ప్రశాంతంగా జరగకూడదని అసద్దుద్దీన్ ఒవైసీ కుట్ర చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో లేనిపోని అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని అసదుద్దీన్ ఒవైసీ కుట్ర చేశారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.
సొంత పార్టీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్
కొందరు బీజేపీ నేతలు ఫాల్తుగాళ్లంటూ విమర్శలు
సొంత పార్టీ నేతలతో పాటు ఓవైసీ బ్రదర్స్ పై రాజాసింగ్ విమర్శలు
పవిత్రమైన రంజాన్ మాసంలో హిందువులపై ఒవైసీ బ్రదర్స్ విషం కక్కుతున్నారు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పారిపోయే… pic.twitter.com/daHKtJua4O
— BIG TV Breaking News (@bigtvtelugu) March 15, 2025
ALSO READ: CM Revanth Reddy: ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అయిపోతాడా.. సీఎం రేవంత్ ఉగ్రరూపం..