E-Paper
Advertisement

ఆర్మీ డిపోలో ఆయుధాల చోరీ.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు.. 810 బుల్లెట్లు స్వాధీనం!

ఆర్మీ డిపోలో ఆయుధాల చోరీ.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు..  810 బుల్లెట్లు స్వాధీనం!
Advertisement

Bollaram Arms Theft Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో సంచలన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన హవల్దార్ మల్లేశ్ ను జరిపిన విచారణలో మరో ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు.. ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులకు ఈ నేరంతో సంబంధం ఉన్నట్టుగా వెల్లడైంది. దాంతో ఈ అయుదుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా విచారణలో తెలిసిన వివరాలతో పోలీసులు మల్లేశ్ నుంచి మరో 810 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు

చీమ కూడా దూరలేనంత భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ లోని ఆయుధాగారం నుంచి అత్యాధునిక ఏకే 47, ఏకే 203 తుపాకులు, పిస్టళ్లు, నైట్ విజన్ బైనాక్యులర్లను పెద్ద సంఖ్యలో చోరీ అయిన విషయం తెలిసిందే. దీనిపై మల్కాజిగిరి పోలీసులు, ఎస్వోటీ బృందాలు, ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సెల్ ఫోన్ టవర్ల నుంచి 8.50 లక్షలకు పైగా మొబైల్ ఫోన్ డంప్ డేటాను సేకరించి విశ్లేషించారు. పక్కాగా ఆధారాలు సేకరించి రిటైర్డ్ హవల్దార్ మల్లేశ్ ను అరెస్ట్ చేశారు.

Advertisement

అతని నుంచి చోరీ చేసిన వెపన్స్, బుల్లెట్లు, నైట్ విజన్ బైనాక్యులర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరంతో మరికొందరికి సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతోపాటు పాకిస్తాన్ లో ఉంటూ మన దేశంలో హింసకు కుట్రలు చేస్తున్న షెహజాద్ భట్టీ నెట్ వర్క్ తో మల్లేశ్ కు ఏవైనా కాంటాక్ట్ ఉందా? అన్న సందేహాలు కూడా తలెత్తాయి. పాకిస్తాన్ కు చెందిన ఓ ఆయుధ వ్యాపారిని మల్లేశ్ ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నట్టు వెల్లడి కావటం వీటికి బలాన్ని చేకూర్చింది.

Also Read: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!

Advertisement

దాంతో పోలీసులు కోర్టు అనుమతితో మల్లేశ్ ను 10 రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించారు. దీంట్లో మొదట తాను ఒక్కన్నే చోరీ చేసినట్టుగా మల్లేశ్ చెప్పాడు. అయితే అతని సెల్ ఫోన్ కాల్ డేటా వివరాలు.. ఇతర ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించగా ఆయుధాగారంలో పని చేస్తున్న ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు వినోద్, శేషుతో పాటు మరో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తుల పేర్లు తెలిపాడు. ఈ క్రమంలో మరింత లోతుగా విచారణ చెయ్యగా మల్లేశ్, వినోద్ ల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా తేలింది. దాంతో పోలీసులు ఈ అయుదుగురిని కూడా అరెస్ట్ చేశారు. ఇక, పోలీస్ కస్టడీ ముగియటంతో గురువారం వైద్య పరీక్షలు జరిపించి మల్లేశ్ ను కోర్టులో హాజరు పరిచారు. అనంతరం జైలుకు రిమాండ్ చేశారు.

Also Read: భూమిపై అత్యంత సుందరమైన జలపాతాలు.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

Tags

Related News

సీఎం రేవంత్‌ని చూస్తేనే కేటీఆర్‌కు భయమైతుంది: వేముల వీరేశం!

సిరిసిల్ల పర్యటనపై రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్.. ఏమన్నారంటే?

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. సంచలన తీర్పు ఇచ్చిన మేడ్చల్ కోర్టు!

ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆన్‌లైన్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు!

దేవుళ్లను విభజించడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్.. హామీలు అమలు చేయకుండా కొత్త డ్రామాలంటూ..

ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు.. ఇకపై హాయిగా ట్రావెల్ చేయవచ్చు, అసలు మేటరేంటి?

ఫిర్యాదు చేస్తే ఎదురుదాడి చేస్తారా.. గద్వాల జిల్లాలో దారుణం!

Big Stories

Advertisement
×