Romantic Family Drama: ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య ప్రేమ, ఆస్తి, అసూయలు మొదలైనవి చిచ్చు పెట్టడం కొత్తేమీ కాదు. కానీ ఒక స్వతంత్ర భావాలు ఉన్న మహిళ వారి జీవితాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆ బంధం పూర్తిగా మారిపోతే, అన్నదమ్ముల మధ్య ఆ అమ్మాయి కోసం రచ్చ మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇలా తరతరాలుగా కొనసాగుతున్న కుటుంబ సంఘర్షణ, ప్రేమ, మంచి–చెడుల మధ్య పోరాటాన్ని చూపించే సిరీస్ ‘ఈస్ట్ ఆఫ్ ఈడెన్’ (East of Eden). మరి జాన్ స్టెయిన్ బెక్ నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు అంటే ?
1900ల ప్రారంభంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో కథ మొదలవుతుంది. ట్రాస్క్ కుటుంబానికి చెందిన ఆడమ్, చార్లెస్ ఇద్దరూ అన్నదమ్ములు. ఒకే కుటుంబంలో పెరిగినా ఇద్దరి స్వభావాలు, ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వారి మధ్య ఉన్న బంధంలో ప్రేమతో పాటు పోటీ, అసూయ కూడా కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో క్యాథీ ఏమ్స్ వారి జీవితాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. తనకు నచ్చినట్టుగా జీవించాలని భావించే వ్యక్తి క్యాథీ. కానీ ఆమె సాధారణ కుటుంబ జీవితానికి సరిపోయే అమ్మాయి మాత్రం కాదు.
ఆమె స్వభావం, నిర్ణయాలు, తన చుట్టూ ఉన్నవారిపై చూపించే ప్రభావం క్రమంగా ట్రాస్క్ కుటుంబాన్ని బీటలు వారేలా చేస్తుంది. ఒక మహిళ ఇద్దరు అన్నదమ్ముల మధ్య దూరాన్ని పెంచడం మాత్రమే ఈ సిరీస్ కథ కాదు. వారి కుటుంబంలో తరతరాలుగా కొనసాగుతున్న భావోద్వేగాలు, తల్లిదండ్రుల ప్రభావం, ప్రేమను పొందాలనే కోరిక, అసూయ, నైతిక నిర్ణయాలు… ఇవన్నీ కలసి పెద్ద కుటుంబ గాథగా మారతాయి. క్యాథీ పాత్ర ఈ కథలో కీలకంగా మారుతుంది.
ఆమె తీసుకునే నిర్ణయాలు ఆడమ్, చార్లెస్ జీవితాలను మాత్రమే కాకుండా తర్వాతి తరాలపై కూడా ప్రభావం చూపుతాయి. కాలం మారుతున్న కొద్దీ కుటుంబంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. పాత గాయాలు మళ్లీ బయటపడతాయి. ఒక తరం తీసుకున్న నిర్ణయాల ప్రభావం మరో తరానికి ఎలా చేరుతుందనేదే సిరీస్ లో ప్రధానంగా కనిపిస్తుంది. ఈ కథలో మంచి, చెడు అనేవి కేవలం రెండు వైపులుగా చూపించకుండా… మనిషి పరిస్థితులు, నిర్ణయాల వల్ల ఎలా మారుతాడనే అంశాన్ని బాగా చూపించారు. మరి ఇంతకీ అన్నదమ్ముల మధ్య ఆ అమ్మాయి పెట్టిన చిచ్చు ఎలా రగిలింది ? చివరకి ఏమైంది ? అనేది తెరపై చూడాల్సిందే.
ఫ్లోరెన్స్ ప్యూ, క్రిస్టోఫర్ అబాట్, మైక్ ఫైస్ట్, హూన్ లీ, సియారన్ హిండ్స్ తదితరులు నటించిన ‘ఈస్ట్ ఆఫ్ ఈడెన్’ సిరీస్ ను జోయ్ కజాన్ రూపొందించారు. గార్త్ డేవిస్ తొలి నాలుగు ఎపిసోడ్లకు, లారే డి క్లెర్మాంట్-టోనెర్ తర్వాతి మూడు ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఈ సిరీస్ లోని ఏడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సిరీస్ ఇంగ్షీషుతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: స్కూల్లో స్టూడెంట్ రౌడీ వేషాలు… టీచర్ ఇచ్చే ట్విస్టుకు పట్టపగలే చుక్కలు… కొరియన్ టీచరా మజాకా