Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Women’s ODI World Cup 2025 tournament ) నేపథ్యంలో ఐసీసీ పాలక మండలి ( ICC ) కీలక ప్రకటన చేసింది. మహిళల వరల్డ్ కప్ చూసేందుకు అభిమానులు ఎక్కువ వచ్చేందుకు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది ఐసీసీ. మహిళల వన్డే వరల్డ్ కప్ టికెట్ల ధరలు… కేవలం 100 రూపాయలుగా నిర్ణయించింది ఐసీసీ. ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించేందుకు లీగ్ మ్యాచ్లకు ఈ ధరలు అందుబాటులో ఉంటాయని తాజాగా అధికారిక ప్రకటన చేసింది ఐసీసీ పాలకమండలి. కేవలం మహిళల వన్డే వరల్డ్ కప్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది ఐసీసీ. కాగా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఐసీసీ నిర్వహించనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ చేసింది ఐసీసీ పాలకమండలి. ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. శ్రీలంక తో పాటు మన ఇండియా కూడా మహిళల వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే అక్టోబర్ మాసంలో కొన్ని మ్యాచ్లు విశాఖపట్నం వేదికగా కూడా జరగనున్నాయి. విశాఖలో అక్టోబర్ 9, 12, 13, 16 అలాగే 26 తేదీలలో మ్యాచులు కొనసాగుతాయి. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Women’s ODI World Cup 2025 tournament ) నేపథ్యంలో…. రంగంలోకి ఓ స్పెషల్ లేడీ రాబోతున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభం కాబోతున్న ఈ టోర్నీ నేపథ్యంలో ప్రారంభ వేదికలో… సింగర్ శ్రేయ ఘోషాల్ పాల్గొంటారు. గువాహటిలో ఈ వేడుకలను సింగర్ శ్రేయ ఘోషాల్ తో పాటు కూడా ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని పాటలు కూడా పాడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా… మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది.
ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, ఆష్ గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్‌హామ్
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Australia have named their 15-player squad for the upcoming Women’s Cricket World Cup 2025. 🇦🇺🔥
Will the defending champions go all the way again in India? 🏆#CWC25 #Australia #Cricket #Sportskeeda pic.twitter.com/BYMkkSA9LK
— Sportskeeda (@Sportskeeda) September 5, 2025