Big Stories

Telangana Meeting in Mahabubabad: రంగంలోకి సీఎం రేవంత్.. ఎక్కడెక్కడ..?

Telangana Meeting in Mahabubabad:  తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రధాన పార్టీల నుంచి తొలిరోజు 42 మంది అభ్యర్థులు తమతమ నామినేషన్లను దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఈటల, డీకె అరుణ, రఘునందన్‌రావు, భరత్ ప్రసాద్ ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మల్లురవి సహా పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు.

- Advertisement -

నామినేషన్ల పర్వం మొదలుకావడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నుంచి వివిధ జిల్లాల్లో ఎన్నికల సభలకు శ్రీకారం చుడుతున్నారు. కొన్ని సభలకు జాతీయస్థాయి నాయకులు హాజరుకానున్నారు. ఇందులోభాగంగా మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌‌‌‌‌‌‌‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరుకానున్నారు. సాయంత్రం మహబూబాబాద్‌లో జరగనున్న బహిరంగ‌సభకు అటెండ్ కానున్నారు.

- Advertisement -
CM Revanth Reddy to address public meeting in Mahabubabad
CM Revanth Reddy to address public meeting in Mahabubabad

Also Read: Medchal Asian Blood Centre : బ్లడ్ సెంటర్ లో అధికారుల తనిఖీలు.. RBC, ప్లాస్మా బ్యాగులు సీజ్

ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి నియోజకవర్గాల రోడ్ షోలు, ర్యాలీల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నమాట. ప్రచారం గడువు ముగిసేలోపు ఎక్కువ ప్రచార సభలు నిర్వహించాలని పార్టీ ఆలోచన. వీలుంటే ప్రతి నియోజకవర్గంలోని రెండు లేదా మూడు సభలు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అములు చేస్తున్న పథకాలతోపాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విసృత్తంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి 20రోజుల పాటు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగనుందన్నమాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News