KCR: ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. గత ఆరు గంటలుగా BRS ముఖ్య నేతలతో కేసీఆర్ కాళేశ్వరం నివేదికపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. హరీష్ రావు, కేటిఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తదితర బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్న వాడు అజ్ఞాని…..
కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటికి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించిందేనని..ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన అన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చని.. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని చెప్పారు. కాళేశ్వరంపై క్యాబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం కమిషన్ నివేదకిపై డిప్యూటీ సీఎం భట్టి ఏమన్నారంటే..?
అటు తెలంగాణ సచివాలయంలో కాసేపటి క్రితమే కేబినెట్ భేటీ స్టార్ట్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యే ముందు కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యారు.
ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయి….
మీడియాతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం నివేదిక చూస్తే కానీ ఏముందో తెలియదని భట్టి విక్రమార్క చెప్పారు. కేబినెట్‌లో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై కచ్చితంగా చర్చ ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. నివేదికపై చర్చించిన తర్వాత అనంతరం..ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని సీఎంతో డిస్కస్ చేస్తామన్నారు. కాగా.. కేబినెట్ సమావేశం అనంతరం ఈ నివేదికపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక, కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీల నిర్మాణానికి పూర్తి బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్ దేనని కాళేశ్వరం కమిషన్ నివేదికల ద్వారా తేల్చిచెప్పింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని రిపోర్టు రూపొందించి ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే..
ALSO READ: Weather News: భారీ వర్షం.. పట్టపగలే చిమ్మచీకటి, ఈ ప్రాంతాల్లో పిడుగులు..?
ALSO READ: Intelligence Bureau: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4987 జాబ్స్.. రూ.69,100 జీతం.. లాస్ట్ డేట్?