BRS Leaders At SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లడానికి బీఆర్ఎస్ బృందం భారీ సంఖ్యలో బయల్దేరారు. ఎక్కువ వాహనాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రావడంతో దోమలపెంట చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.
ALSO READ: Indian Army Jobs: డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోనే రూ.56,100 వేతనం
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కువ వాహనాల్లో టన్నెల్ వద్దకు రావడానికి ప్రయత్నించారు. దీంతో కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పారు. హరీష్ రావుతో పాటు మరో ఐదారుగురిని మాత్రమే టన్నెల్ వద్దకు వెళ్లడానికి పర్మిషన్ ఇస్తామని పోలీసులు పేర్కొన్నారు. అలాగే కెమెరా తీసుకుని వెళ్లెందుకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఎస్పీ, హరీష్ రావును టన్నెల్ దగ్గరకు వాహనంలోకి పంపారు. హరీష్ తో పాటు జగదీశ్వర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లను పోలీసులు టన్నెల్ వద్దకు పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు కెమెరాను లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి పోలీసులు తిరస్కరించారు. పోలీసుల తీరుపై హరీశ్‌రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటనను పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
ఓవైపు ఎస్ఎల్‌బీసీ టెన్నల్ దగ్గరు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా ఆందోళనకు దిగడం ఎంత వరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో అధికారులు ఓ వైపు బీజీగా ఉండగా.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా చేయడం ఏ మాత్రం సరికాదని సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్ చేస్తున్నారు.