E-Paper
Advertisement

అమ్మబాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇన్ని సౌకర్యాలా? సీటుకో టీవీ, ఎయిర్ హోస్టెస్, నచ్చిన ఆహారం!

అమ్మబాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇన్ని సౌకర్యాలా? సీటుకో టీవీ, ఎయిర్ హోస్టెస్, నచ్చిన ఆహారం!
Advertisement

KSRTC Business Class: విమానాల్లో ఉండే సౌకర్యాలు, ఆహ్లాదకరమైన సేవలతో బస్సు ప్రయాణం చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి అద్భుతమైన అనుభవాన్ని ప్రయాణికులకు అందించేందుకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ఓ సరికొత్త బిజినెస్ క్లాస్ బస్సు సేవను అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం సౌకర్యాలతో నడుస్తున్న ఈ బస్సు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి బస్సును తమ రాష్ట్రంలోనూ తీసుకువస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి.

బస్సు వీడియో వైరల్..

అజయ్ జోనీ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ కేరళ బిజినెస్ క్లాస్ బస్సుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో బస్సులోని విలాసవంతమైన సీట్లు, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఎంటర్టైన్మెంట్ స్క్రీన్‌లు, అటాచ్డ్ వాష్‌రూమ్ వంటి అత్యాధునిక సదుపాయాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వీటితో పాటు అచ్చం విమానాల తరహాలో ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులకు చిరుతిళ్లు, పానీయాలు అందించడం అందరినీ అమితంగా ఆకట్టుకుంది.

బస్సులో మరిన్ని ప్రత్యేకతలు

Advertisement

ఈ బిజినెస్ క్లాస్ బస్సులో ప్రయాణాన్ని అత్యంత సుఖవంతంగా మార్చేందుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. బస్సులో మొత్తం 36 ప్రీమియం రీక్లైనింగ్ సీట్లను అమర్చారు. ప్రతి సీటు వద్ద ప్రయాణికుడికి కోసం ప్రత్యేకంగా పర్సనల్ స్క్రీన్ అందించారు. ప్రయాణంలో వేడి కాఫీ, చల్లటి పానీయాల కోసం మిని రిఫ్రిజిరేటర్, కాఫీ మేకర్ అందుబాటులో ఉంచారు. అలాగే స్మార్ట్‌ఫోన్ల ఛార్జింగ్ కోసం USB పోర్టులతో పాటు, ప్రయాణమంతా ఆస్వాదించడానికి ఉచిత వైఫై సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు.

ఆ మార్గాల్లో బస్సు ప్రయాణం

ఈ ప్రీమియం బిజినెస్ క్లాస్ బస్సు సర్వీస్ తిరువనంతపురం – కొచ్చి (ఎర్నాకుళం) మధ్య నడుస్తోంది. రూటును బట్టి ఈ ప్రయాణ దూరం సుమారు 200-227 కిలోమీటర్ల వరకు ఉంది. బస్సు టైమింగ్స్ విషయానికి వస్తే.. ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు తిరువనంతపురంలో బయలుదేరే ఈ బస్సు.. కొల్లాం ఆయతిల్, ఆలప్పుళ కొమాడి, హైకోర్టు మీదుగా ఉదయం 9:30 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5:30 గంటలకు యర్నాకుళంలో బయలుదేరి అదే మార్గంలో రాత్రి 9:30 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. అయితే శని, ఆదివారాలు ఈ బస్సు అందుబాటులో ఉండదు.

Advertisement

Also Read: జియో సంచలనం.. తక్కువ ధరకే కొత్త రూటర్ లాంచ్.. ఒకేసారి 100+ డివైజ్ కనెక్టివిటీ!

టికెట్ ధర, బుకింగ్ విధానం

తిరువనంతపురం నుండి ఎర్నాకుళం ప్రయాణానికి బిజినెస్ క్లాస్ టికెట్ ధరను రూ. 671 గా నిర్ణయించారు. ఈ బస్సులో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు.. ‘KSRTC స్విఫ్ట్’ ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా గానీ, 9447071021 అనే వాట్సాప్ నంబర్ ద్వారా గానీ తమ టికెట్లను సులభంగా రిజర్వ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ప్రయాణ తేదీ, రూటు, సీటును ఎంచుకుని పేమెంట్ పూర్తి చేయగానే ఈ-టికెట్, పీఎన్ఆర్ (PNR) వివరాలు వాట్సాప్‌కు చేరనున్నాయి.

Also Read: బిగ్ టీవీ లోగోతో ‘DIG’ దందా.. సీఎం ఫ్యామిలీపై ఫేక్ ప్రచారం.. బీఆర్ఎస్ బడా నేత గుట్టురట్టు!

Tags

Related News

లైఫ్ టైమ్ ఫ్రీ ఫ్లైట్ పాస్.. పైలట్‌ స్మిత్ మచ్చార్‌కు ఇజ్రాయెల్ సూపర్ గిఫ్ట్!

వెదురు సాగుతో సిరుల వర్షం.. ఒక్కసారి నాటితే ఏళ్ల పాటు ఆదాయం!

లోకో పైలెట్ vs అసిస్టెంట్ లోకో పైలెట్.. ఇద్దరిలో అసలు రైలును నడిపేది ఎవరు?

సకినాలు, సర్వ పిండి నుంచి బిర్యానీ వరకు.. బేగంపేటలో తెలంగాణ రుచుల విందు!

సోలార్ ప్యానెళ్లతో భవిష్యత్తులో ముప్పు తప్పదా? 25 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందంటే?

2026లోనే ప్రపంచం అంతం.. నవంబర్ 13న ప్రళయం రాబోతుందా?

భరతనాట్యంతో సేఫ్టీ రూల్స్ చెప్పే ప్రయత్నం.. నెట్టింట ఎయిర్ ఇండియా వీడియో వైరల్!

Big Stories

Advertisement
×