Big Stories

BRS Power Scam | ఒక్క విద్యుత్‌ శాఖలోనే రూ.81516 కోట్ల అవినీతి.. ఇదీ బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనత!

BRS Power Scam | మాజీ సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. గులాబీ నేతల అవినీతి బాగోతాన్ని బయటపెడతానన్న ముఖ్యమంత్రి రేవంత్‌ ఆ దిశగా ఫోకస్‌ పెట్టారు. అందులో భాగంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దృష్టి సారించిన కాంగ్రెస్‌.. గులాబీ నేతలు ఏ సంస్థలో ఎంత దోచుకున్నారన్న దానిపై దృష్టిపెట్టింది. కేసీఆర్‌ 24 గంటల కరెంట్‌ గురించి గొప్పగా చెప్పిన విద్యుత్‌ శాఖపై ఆరా తీస్తోంది.

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిందే చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ పాలను టార్గెట్‌ చేసిన రేవంత్‌… ఆ దిశగా పావులు కదుపుతున్నారు. కేసీఆర్‌ గొప్పలు చెప్పుకున్న ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. అదే పనుల్లో ఏ మేర అవినీతికి పాల్పడ్డారో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్‌ సంస్థల స్థితిగతులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లెక్కలపై కూపీ లాగుతున్నారు. ఈ అధ్యయనంలో ఒక్క విద్యుత్‌ శాఖలోనే 80 వేలకుపైగా అవినీతికి పాల్పడినట్టు గుర్తించారు.

- Advertisement -

విద్యుత్‌ సంస్థలు 81 వేల 516 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని.. డిస్కమ్‌లు 50 వేల 275 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు గుర్తించింది. ఇటీవల సీఎం రేవంత్‌ విద్యుత్‌శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అలాగే కరెంట్‌ ఛార్జీల రూపంలో 28 వేల కోట్ల దాకా డిస్కమ్‌లకు ప్రభుత్వం బకాయిలు ఉండటమే కాకుండా… ట్రూఅప్‌ ఛార్జీల కింద చెల్లిస్తామని చెప్పిన 12 వేల 515 కోట్లు చెల్లించలేదని అధికారులు తెలిపారు . మరోవైపు కేసీఆర్ పాలనలో అవసరం లేకపోయినా 30 వేల కోట్లను వెచ్చించి విద్యుత్‌ను కొనుగోలు చేసిందని.. ఈ కొనుగోళ్లతో బీఆర్‌ఎస్‌ నేతలు కొందరి లబ్ది చేకూరిందని గుర్తించిట్టు తెలుస్తోంది. దీంతో విద్యుత్‌ సంస్థలో లెక్కలను దాచిన అధికారులపై ప్రస్తుత సర్కార్ చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News