BigTV English

Cabinet: జూన్ 5న కేబినెట్ భేటీ.. రాజీవ్ యువ వికాసం స్కీంపై చర్చ.. ఎవరికి ఇస్తారంటే?

Cabinet: జూన్ 5న కేబినెట్ భేటీ.. రాజీవ్ యువ వికాసం స్కీంపై చర్చ.. ఎవరికి ఇస్తారంటే?

Cabinet: జూన్ 5న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలను చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ యువ వికాసం స్కీం గురించి సుదీర్ఘంగా చర్చించనున్నట్టు సమాచారం. అనుకున్న దానికంటే ఎక్కువగా రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తులు వచ్చాయి. దీంతో.. పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ జరిగిన తర్వాతనే.. అర్హుల జాబితా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల సమస్యపై వేసిన కమిటీ రిపోర్టుపై కూడా చర్చించనున్నారు. కేబినెట్ ‌లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.


రాజీవ్ యువ వికాసం స్కీం కింద ఇప్పటివరకు 16 లక్షల పైచిలుకు తెలంగాణ యువత నుంచి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం నాలుగు కేటగిరీల్లో ఆయా దరఖాస్తులను స్వీకరించింది తెలంగాణ ప్రభుత్వం. తొలి విడతగా లక్ష మందికి 50 వేల నుంచి లక్ష రూపాయల విలువ గల యూనిట్లకు సంబంధించి ఎంపికైన లబ్దిదారులకు మంజూరు పత్రాలు రెడీ అయినట్టు పేర్కొన్నారు. అయితే జూన్ 2న ఎంపికైన లబ్దిదారులకు యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం మొదట నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మొదటి లిస్టు దాదాపుగా ఫైనల్ అయ్యిందని కూడా తెలిపింది. అయితే.. ప్రస్తుతం ఈ స్కీంకు ఎక్కువగా దరఖాస్తులు రావడంతో.. కేబినెట్ భేటీ నిర్వహించి పథకం గురించి క్లియర్ కట్‌గా డిస్కస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ALSO READ: Navodaya Notification: పిల్లల బంగారు భవిష్యత్తు కోసం హైక్వాలిటీ స్టడీ.. అంతా ఫ్రీ, డోంట్ మిస్


రేవంత్ సర్కార్ తెలంగాణ ఫార్మెషన్ డే సందర్భంగా జూన్ 2న ఆయా పత్రాలను లబ్దిదారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు కూడా పూర్తి చేసింది. జూన్ 2 నుంచి 9 వరక సంబంధించిన ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత జూన్ 10 నుంచి 15 వరకు ఎంపికైన లబ్దిదారులకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలని అనుకుంది. కానీ ఇప్పుడు సడెన్‌గా ఎక్కువగా అప్లికేషన్‌లు రావడంతో.. ప్రభుత్వం కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ భేటీలో స్కీంకు లబ్దిదారులను సెలెక్ట్ చేసే విధానం..? పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ చేసిన తర్వాతనే అర్హుల జాబితాను విడుదల చేస్తారా? అనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ALSO READ: Telangana Movement: తెలంగాణ ఉద్యమంలో రియల్ హీరోలు వీళ్లే..! 

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×